Begin typing your search above and press return to search.
టాయ్ లెట్లో హిందూ దేవతల బొమ్మలు..!!
By: Tupaki Desk | 20 Nov 2018 11:44 AM GMTఇప్పటికే జాతి వివక్ష జాడ్యం అమెరికన్లలో తారాస్థాయికి చేరిందనే పరిణామాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. దీన్ని నిజం చేస్తూ...తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో హిందు దేవతల బొమ్మలను అవమానిస్తూ అనేక సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా న్యూజెర్సీలోని ఓ నైట్ క్లబ్ వాష్ రూములో వేలాడదీసిన దేవతా చిత్రాలపై ఓ భారత సంతతి మహిళ తీవ్రంగా స్పందించింది. అంకితా మిశ్రా బ్రూక్ లిన్ లోని ‘హౌజ్ ఆఫ్ ఎస్’ అనే నైట్ క్లబ్ కు వెళ్ళినప్పుడు అక్కడ దేవతా విగ్రహాల బొమ్మలను టాయిలెట్ వద్ద చూసి ఆ క్లబ్ ఓనర్లకు రాసిన లెటర్లో క్లాస్ పీకింది. ‘‘మీ టాయిలెట్ డెకార్ ను మార్చండి అని చెబుతూనే తనకున్న విలువలు, ఆత్మగౌరవంపై వివరిస్తూ వారికి దిమ్మతిరిగేలా సమాధానం చెప్పింది. దీంతో ఆ యాజమాన్యం దిగివచ్చింది.
భారత సంతతికి చెందిన అంకితా మిశ్రా అనే మహిళా.. కొద్ది రోజుల క్రితం స్నేహితులతో కలిసి న్యూయార్క్, బష్విక్లోని హాస్ ఆఫ్ ఎస్ పబ్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి టాయిలెట్ కు వెళ్లిన ఆమె షాక్ కు గురైంది. వెంటనే అక్కడ ఓ సెల్ఫీ దిగి యాజమాన్యానికి ఓ ఈమెయిల్ రాసింది. ``వాష్ రూమ్ లో పేపర్ న్యాప్ కిన్ కోసం వెతుకుతుండగా నాకు నగలు ధరించిన హిందూ దేవతల చిత్రాలు కనిపించాయి. అందులో శివుడు - వినాయక - సరస్వతి - బ్రహ్మ - రాధా కృష్ణ చిత్రాలు టాయిలెట్ పైన వేళ్లాడఃదీసి ఉన్నాయి. అవి చూసి సైలంట్ గా ఉండలేకపోయా..అందుకే పబ్ ఓనర్లకు హిందువులు తమ సంస్కృతిని వారు ఎక్కడ ఉన్నా ఎంత బాగా పూజిస్తారో...గౌరవిస్తారో చాలా స్సష్టంగా తెలియచెప్పా. `` అని వివరించారు.
ఆమె మెయిల్‌కు స్పందించిన సదరు పబ్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పడంతో పాటు టాయిలెట్ గోడలపై ఆ చిత్రాలను తొలిగిస్తామని హామీ ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లో ఈ చిత్రాలును చూసి.. అందంగా ఉన్నాయి కదా అని ఇక్కడ వేయించామని క్షమాపణలు తెలిపారు. ఆ చిత్రాలను తొలిగిస్తామని కూడా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ‘బ్రౌన్ గర్ల్’ అనే మ్యాగజైనులో ప్రస్తావిస్తూ అంకిత మిశ్రా ఓ కథనం రాసింది. ఈ కథనం భారీ స్థాయిలో షేర్ అయింది.