Begin typing your search above and press return to search.

వీళ్లు మందు బాబులు కాదు.. మందు మగువలు.!

By:  Tupaki Desk   |   9 May 2020 2:30 AM GMT
వీళ్లు మందు బాబులు కాదు.. మందు మగువలు.!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నీ మధ్య తన కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’లో ‘మగువా.. మగువా..’ అంటూ ఆడవారి విలువ గురించి గొప్పగా చెప్పారు. అన్నింటిలోనూ ఆడవారు మగవారికి సాటి అంటూ చాటిచెప్పారు.ప్రస్తుత సమాజంలో విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. మద్యం తాగడంలోనూ మగవులు మగాళ్లకు పోటీనిస్తుండడం విశేషంగా మారింది. లాక్ డౌన్ సడలించాక 43 రోజుల తర్వాత మద్యం షాపుల ముందు కూడా మగువలు క్యూలు కట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

పొగ తాగనివాడు దున్నపోతై పుట్టును అన్నాడు గిరీషం. కానీ ఇప్పుడు పొగతోపాటు మద్యం కూడా వచ్చి చేరింది. దేశంలో మెట్రో పాలిటిన్ సిటీలు పెరిగిపోయాయి. ఆడవారు కూడా సాఫ్ట్ వేర్ రంగంలో రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో అన్ని పనులు చేస్తున్నారు. మగాళ్లు సేదతీరడానికి మద్యం తాగినట్టే ఆడవాళ్లు కూడా తాగేస్తున్నారు.

తాజాగా బెంగళూరు సహా హైదరాబాద్ లో మద్యం షాపుల ముందు మగువలు మద్యం కోసం క్యూ కట్టేశారు. నీళ్లు తాగినంత సులువుగా బీర్లు, లిక్కర్ తాగేస్తున్న వీడియోలు తాజాగా బయటకొచ్చాయి. మగాళ్లకు మందులోనూ పోటీనిస్తున్న మగువులను చూసి శభాష్ అనాలో లేక వాళ్లు కూడా తాగితే తమకు మద్యం దొరకదని మగాళ్లు బాధ పడాలో తెలియని పరిస్థితి.

మహిళలు మందు తాగడాన్ని ఎవ్వరూ కాదనరు. ప్రస్తుత సమాజంలో ఇది కామన్ అయిపోయింది. ఏదైనా ఫంక్షన్లు పెళ్లిళ్లలో కల్లు సహా బీర్లు, లిక్కర్ ను కూడా మహిళలు వేసేస్తున్నారు. రిలాక్స్ కోసం మగవాళ్లు కూడా ఆడవాళ్లను పుచ్చుకోండని ఓ బాటిల్ వాళ్లకు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం బీర్లు అయితే మహిళలు నీళ్లు తాగినంత ఈజీగా అందరూ తాగేస్తున్నారు.

తాజాగా ఓ వైన్ షాపు నుంచి 90ఎంల్ తీసుకొని గడగడతాగేసిన ఓ యువతి వీడియో వైరల్ అయ్యింది. ఇక ముసాలావిడ మద్యం రోజూ పెగ్గు తాగుతానని.. లాక్ డౌన్ లో దొరక్క కల్లు తాగితే కడుపు ఉబ్బుతోందని.. అందుకే ఫుల్ బాటిల్ మద్యం కొన్నానని మరో వీడియోలో చెప్పింది. తనకు మద్యం తాగకపోతే నిద్రపట్టదని..చచ్చినా పర్లేదు కానీ మద్యం మానని ఆ మహిళ తెలిపింది. అసలు లాక్ డౌన్ ఎత్తేసాకే తెలిసింది. ఇంతమంది ఆడవాళ్లు మద్యం కోసం క్యూ కట్టడం.. వారు కూడా తాగుతారని తేలింది. దీన్ని చూసి ఆశ్చర్యపోవడం మగాళ్ల వంతైంది. పురుషులూ మరి ఆడాళ్లు తాగుతున్నారు.. స్టాక్ అయిపోకముందే త్వరపడండి మరీ..

ఇలా ఇన్నాళ్లు మద్యానికి మగువలు దూరం అన్న నానుడి ఇప్పుడు పోతోంది. భవిష్యత్ లో ఇంట్లో ఒక గ్లాస్ పెగ్గు స్థానంలో రెండు గ్లాస్ పెగ్గులు రావచ్చు. అది మీ శ్రీమతికి కేటాయించడం తప్పని సరి అవుతుందేమో.. మాంచిగా ఆమ్లెటో, చికెనో వేసుకొని ఆలు మగలు తాగే రోజులు తొందరలోనే రాబోతున్నాయన్నమాట..