Begin typing your search above and press return to search.
'సింగిల్' స్టేటస్ కే మొగ్గు చూపుతున్న భారత మహిళలు..!
By: Tupaki Desk | 11 Dec 2022 12:30 AM GMTఆడవాళ్లు మగ తోడు లేకుండా బ్రతికేందుకు ఇష్టపడుతున్నారా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. సమాజంలో మగవాడు ఒంటిరిగా జీవిస్తే వాడిని 'ఏక్ నిరంజన్'తో పోలుస్తుంటారు. అదే ఆడవాళ్లు ఒంటరిగా జీవించాల్సి వస్తే మాత్రం సమాజం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయినప్పటికీ నేటి ఆడవాళ్ళు సింగిల్ గా ఉండేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని వెల్లడవుతోంది. ఈ క్రమంలోనే ఒంటిరిగానే జీవించేందుకు వారంతా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఫేస్ బుక్ లో 'స్టేటస్ సింగిల్' కమ్యూనిటీలోని ఆడవాళ్ళంతా గత ఆదివారం దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్ గదిలో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చించడం ఆసక్తిని రేపుతోంది.
ఈ కార్యక్రమంలో దేశంలోని పలు నగరాలకు చెందిన ఒంటరి మహిళలు పాల్గొన్నారు. వీరిలో విడాకులు తీసుకున్న వారు.. వితంతువులు.. పెళ్లికాని మహిళలు ఉన్నారు. ఒంటరిగా ఉండే మహిళల కోసమే 'సింగిల్ స్టేటస్' గ్రూప్ మొదలు పెట్టినట్లు ప్రముఖ రచయిత శ్రీమోయి ప్యోకుందు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఇకపై ''విడాకులు తీసుకున్న వారు.. పెళ్లికాని వారు... వితంతువు లాంటి పదాలతో సంబోధించడం ఇక్కడి ఆపేయండి''.. ''సగర్వంగా మనం ఒంటరిగా జీవిస్తున్నాం..(ఫౌడ్లీ సింగిల్)'' అని చెప్పుకుందామని శ్రీమోయి ప్యోకుందు అనగానే మహిళలంతా పెద్దఎత్తున చప్పట్లతో హర్షం వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆమెలాగే ఎంతో మంది డాక్టర్లు.. లాయర్లు.. ఫ్రొఫెషినల్స్.. సామాజిక కార్యకర్తలు.. జర్నలిస్టులు ఉన్నారు. సమాజంలో మహిళలు ఒంటిరిగా జీవించడం అంత తేలిక కాదని.. జనాలు నిత్యం వారి గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారని వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారంగా భారత్ లో 7.14 కోట్ల మంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నట్లు వెల్లడైంది.
ఈ సంఖ్య బ్రిటన్.. ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువని అలాంటప్పుడు ఒంటరిగా జీవించే మహిళలపై వివక్ష ఎందుకని ప్రశ్నించారు. 2001లో భారత్‌లో జీవించే ఒంటరి మహిళల సంఖ్య 5.12 కోట్లు ఉండగా దశాబ్ద కాలంలో ఈ సంఖ్య 39 శాతం పెరిగింది. భారత్ లో మగవారి కంటే మహిళల ఆయు ప్రమాణం ఎక్కువ కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
2021 కోవిడ్ తర్వాత ఈ సంఖ్య మరో 10 కోట్లకు చేరి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ లో చాలా మంది ఒంటరిగానే జీవించాలని భావిస్తున్నారు. దీనికి కేవలం పరిస్థితులే కారణంగా కాదని.. కావాలనే మహిళలు ఒంటరిగానే జీవించేందుకు ఇష్టపడుతున్నారు. పెళ్లి వ్యవస్థపై వారికి నమ్మక లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఏది ఏమైనా ఒక తల్లిగా.. ఒక భార్య.. ఒక కూతురిగా ఇన్నాళ్లు సమాజంలో తన ప్రత్యేకతను చాటుకున్న మహిళ ప్రస్తుత రోజుల్లో 'స్టేటస్ సింగిల్' అని గర్వంగా చెప్పుకునేందుకు ఇష్టపడుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పురుషులు సైతం ఇటీవలి కాలంలో ఏక్ నిరంజన్ గా జీవించేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో పెళ్లి వ్యవస్థ అనేది కుప్పకూలడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.