Begin typing your search above and press return to search.
భారత యువత ఆందోళన దానిపైనే..!
By: Tupaki Desk | 16 Nov 2021 8:30 AM GMTభారతదేశంలో నిరుద్యోగ స్థాయి మరింత పెరిగిందని మరోసారి స్పష్టమైంది. ఇప్ సాస్ అనే ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. భారత దేశంలో ఎక్కువ మంది నిరుద్యోగం పట్ల ఆందోళన చెందుతున్నట్లు ఈ సర్వే పేర్కొంది. కరోనా కారణంగా భారతదేశం ఆర్థిక వ్యవస్థ పడిపోయిందని.. దీంతోనే నిరుద్యోగం పెరిగినట్లు సర్వే నిర్వాహకులు చెప్పారు. అయితే ప్రస్తుతం నిరుద్యోగ సమస్య కొంత మేరకు తగ్గినట్లు పేర్కొన్నారు., కరోనా తగ్గుముఖం పట్టడంతో జాబ్ మార్కెట్ పుంజుకుందని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అయితే నిరుద్యోగ స్థాయి కూడా తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటికే చాలా కంపెనీలు జాబ్ ఓపెనింగ్స్ ని విడుదల చేస్తున్నట్లు గుర్తు చేశారు. పారిశ్రామికోత్పత్తి పెరగడం అనేది ఇందుకు ఓ సూచనగా చెప్పారు. గతంతో పోలిస్తే జాబ్ మార్కెట్ మరింత ముందడుగు వేసినట్లు ఈ సర్వేలో వెల్లడైందని చెప్పుకొచ్చారు. కానీ యువతలో మాత్రం అందోళన అలానే ఉందని స్పష్టం చేశారు.
భారత్ లో నిరుద్యోగం చాలా మందిని ఆందోళనకు గురి చేస్తుంటే.... మరో వైపు ప్రపంచంలో ఎక్కువమంది సామాజిక అసమతౌల్యం మీద ఆందోళన వ్యక్తం చేసినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు. వాట్ వర్రీస్ ది వరల్డ్ గ్లోబల్ మంత్లీ అనే పేరుతో ఇప్ సాస్ ప్రపంచ వ్యాప్తంగా ఈ సర్వేను చేపట్టింది. దీనిలో పలు కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి. భారత్ లో కరోనా పట్ల ఆందోళన చెందే వారి శాతం అక్టోబర్ నెలలో తగినట్లు ఈ సంస్థ పేర్కొంది.
సుమారు 42 శాతం మంది భారత దేశంలో ఏర్పడిన నిరుద్యోగం మీద ప్రధానంగా తమ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఈ సంస్థ పేర్కొంది. అనంతరం కరోనా మీద ఆ తర్వాత అవినీతి మీద ఆందోళన చెందుతున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు ప్రపంచ విషయానికి వస్తే అంతర్జాతీయంగా ఎక్కువమంది సామాజిక సమానత మీద వారి ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పేదరికం, నిరుద్యోగం ఇలాంటివి తమను భయపెట్టే అంశాలు అని వారు చెప్పుకొచ్చారు.
భారత్ లో ఏర్పడిన నిరుద్యోగం మీద యువతలో తీవ్ర అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అని సర్వే నిర్వాహకులు తెలిపారు. కానీ ఏదో ఒకరోజు కచ్చితంగా జాబ్ మార్కెట్ మరింత పుంజుకుంటుందనే విశ్వాసం వారిలో ఉందని చెప్పుకొచ్చారు. ఇదే పరిస్థితి ప్రపంచ దేశాల్లో లేనట్లు ఈ సర్వేలో వెల్లడైంది. కరోనా పూర్తిస్థాయిలో అదుపు లోకి వస్తే జాబ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థాయిలోనే ఉందని చెప్పుకొచ్చారు.
ఇప్ సాస్ సంస్థ ఈ సర్వేను మొత్తంగా 28 దేశాల్లో చేపట్టింది. కేవలం ఆన్ లైన్ ద్వారా 21 వేలకు పైగా మంది దీనిలో పాల్గొన్నారు. ఈ సర్వే సెప్టెంబర్- అక్టోబర్ మధ్య ఈ కాలంలో చేసినట్లు సంస్థ నిర్వాహకులు చెప్పారు. పాల్గొన్నవారు ఎక్కువ మంది 18 నుంచి 74 ఏళ్ల వయసు ఉన్నవారిని చెప్పారు. ఈ సర్వే అమెరికా, ఇజ్రాయిల్, సౌత్ ఆఫ్రికా, టర్కీ, భారత్ లలో నిర్వహించినట్లు పేర్కొన్నారు.