Begin typing your search above and press return to search.
అమెరికాలో ఆ వీసాలు 93% మనోళ్లవే...
By: Tupaki Desk | 22 Nov 2019 11:39 AM GMTఅమెరికాలో భారతీయుల సత్తా గురించి పార్లమెంటు వేదికగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ వివరించారు. అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేసే విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు పని అనుమతి కల్పించే హెచ్-4 వీసాల్లో అత్యధిక ఇంకా చెప్పాలంటే...రికార్డు స్థాయిలో లబ్ధిదారులు ఇండియన్లేనని కేంద్ర మంత్రి తెలిపారు. హెచ్4 కేటగిరీలో అందుతున్న మొత్తం వీసాల్లో..93% ఇండయిన్లే పొందుతున్నారని ఆయన తెలిపారు. ఎంపీ కేజే ఆల్ఫోన్స్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్-4 వీసా విధానాన్ని ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసా కలిగి ఉండి గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నిస్తున్న విదేశీయుల జీవిత భాగస్వాములకు ఈ వీసాలు మంజూరు చేస్తారు. ఈ హెచ్4 వీసాల ద్వారా వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు కల్పించారు. ఈ విధానం భారతీయులకు భారీ లబ్ధి చేకూర్చింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికన్ల అవకాశాలను హెచ్4 వీసా గండికొడుతోందని ఆరోపిస్తూ...ఈ అనుమతులను రద్దుచేశారు.
ఇలా వివాదం నడుస్తున్న తరుణంలో...తాజాగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.... హెచ్-4 వీసాదారులు అమెరికాలో పనిచేసుకొనేందుకు కల్పించిన హెచ్4 సౌలభ్యంలో 93% లబ్ధిదారులు ఇండియన్లేనని అన్నారు. ఈ వీసాను ప్రస్తుతానికి నిలిపివేయబడలేదని..అయితే కోర్టులో కేసులు ఉన్నాయన్నారు. ఇటీవలే ఓ కోర్టులో తీర్పు వచ్చినప్పటికీ...అధ్యక్షుడు ట్రంప్ అధికారగణం దీనికి సవరణలు చేసేందుకు కదులుతోందన్నారు. ఇదిలాఉండగా, అమెరికాలో 1.2 లక్షల మంది హెచ్-4 వీసాదారులు ఉద్యోగాలు చేస్తున్నట్టు అంచనా.