Begin typing your search above and press return to search.

బ్రిటన్ వాసులకే షాకిస్తున్న భారతీయులు

By:  Tupaki Desk   |   11 July 2019 4:08 AM GMT
బ్రిటన్ వాసులకే షాకిస్తున్న భారతీయులు
X
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ఏలిన దేశ మనది. శతాబ్దాలుగా బ్రిటీష్ సామంతరాజ్యంగా బ్రిటీషర్ల వలసరాజ్యంలో దోపిడీకి గురయ్యాం. అయితే స్వాతంత్ర్యం వచ్చింది. తదనంతర కాలంలో ప్రపంచంలో భారత్ కూడా ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. భారతీయుల ప్రతిభకు ప్రపంచ దిగ్గజ సంస్థలే పట్టం కడుతున్నాయి. ప్రముఖ కంపెనీలకు భారతీయులే సీఈవోలుగా ఉండడం విశేషం.

అలా మనల్ని ఏలిన బ్రిటీషర్లను తోసిరాజని ఇప్పుడు వారి దేశంలో అత్యధిక వేతనాలు అందుకుంటున్నారు భారతీయులు. బ్రిటన్ లో బ్రిటీష్ వారికన్నా అత్యధిక వేతనాలు అందుకుంటున్న వారిలో చైనీయులు - భారతీయులు ఉండడం విశేషంగా మారింది. ఈ మేరకు ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటస్టిక్స్’ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం బయటపడింది.

బ్రిటన్ లో బ్రిటీష్ వారికన్నా భారతీయులు అత్యధిక జీతాలు పొందడానికి వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు విద్యార్థతలు ఎక్కువ ఎక్కువగా ఉండడమే కారణం. ఇక చైనీయులు - భారతీయుల తర్వాత బ్రిటీషర్లున్నారు. ఇక వీరి కన్నా తక్కువ వేతనాలు అందుకుంటున్న వారిలో బంగ్లాదేశీయులు ఉన్నారు.

అయితే ఒకే వయసు గల బ్రిటీష్ కార్మికులతో పనిచేసే నల్లజాతీయులు - కరేబియన్స్ కు సమాన జీతాలు చెల్లిస్తున్నారు. ఒకే వృత్తి, అర్హతలున్న వారికి కూడా బ్రిటీషర్లతో సమానంగా ఇతర దేశాల వారికి వేతనాలు చెల్లిస్తున్నారు.

ప్రధానంగా బ్రిటీష్ వారికంటే ఎక్కువగా విద్యార్హతలు, వృత్తినైపుణ్యం వల్లనే చైనా - భారత్ వాసులు ఎక్కువగా వేతనాలు అందుకుంటున్నారని సంస్థ అధ్యయనంలో తేలింది. చైనా ఉద్యోగి సగటు సంపాదన గంటకు 15.75 డాలర్లు కాగా, భారతీయులదీ గంటకు 13.47 డాలర్లు - బ్రిటీష్ వారికి గంటలకు 12.30 డాలర్లు ఉంది. బంగ్లాదేశీయులుదీ 9.60 డాలర్లు సంపాదిస్తున్నారు. పాకిస్తానీలు 10 డాలర్లతో ఉన్నారు.