Begin typing your search above and press return to search.
అమెరికాలో భారీగా ఇళ్లను కొనుగోలు చేస్తున్న భారతీయులు?
By: Tupaki Desk | 14 Nov 2022 5:30 AM GMTఆస్టిన్ బోర్డ్ ఆఫ్ రియల్టర్స్ ఇటీవల విడుదల చేసిన ఒక కొత్త నివేదికలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.. సెంట్రల్ టెక్సాస్‌లోని అంతర్జాతీయ గృహ కొనుగోలుదారులలో మొదటి స్థానం భారతీయులకే దక్కింది. భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ఈ కొనుగోళ్లలో అత్యధిక వాటాను కలిగి ఉన్నారని తేలింది.
అంతర్జాతీయ గృహ కొనుగోలుదారులలో భారతదేశానికి చెందిన గృహ కొనుగోలుదారులు అత్యధిక వాటాను కలిగి ఉన్నారు. దాదాపు 21 శాతం మంతి ఇక్కడ ఇళ్లు కొంటున్నారు. ఆ తర్వాత మెక్సికో (10 శాతం), చైనా (6 శాతం) , కెనడా (4 శాతం) విదేశీ కొనుగోలుదారులు ఉన్నారు. 2022 సెంట్రల్ టెక్సాస్ ఇంటర్నేషనల్ హోమ్‌బ్యూయర్స్ ఈ మేరకు తాజాగా రిపోర్ట్ లో తెలిపింది.
నివేదిక ప్రకారం సెంట్రల్ టెక్సాస్ భారతీయ గృహ కొనుగోలుదారుల కోసం న్యూయార్క్ , శాన్ ఫ్రాన్సిస్కో వంటి ఖరీదైన మెట్రోపాలిటన్ ప్రాంతాలకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. గ్రేటర్ ఆస్టిన్ ఏషియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకారం.. 2010లో గ్రేటర్ ఆస్టిన్‌లోని 165,000 మంది ఆసియా అమెరికన్ వ్యక్తులలో 41 శాతం మంది భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. ఇక్కడే ఇళ్లను కొనుగోలు చేశారు. ఇది 2010లో జనాభాలో 30 శాతం పెరిగింది.
ఆస్టిన్ టెక్ సెక్టార్‌లో వృద్ధి కారణంగా భారతీయులు ఇక్కడ గృహాలను కొనుగోలు చేసే వారి సంఖ్య బాగా పెరిగిందని ఆస్టిన్‌లో రెండు దశాబ్దాలుగా రియల్టర్‌గా పనిచేసిన హేమ్ రామచంద్రన్ తెలిపారు. రామచంద్రన్ ఖాతాదారులలో ఎక్కువ మంది భారతీయులు ఉండడం విశేషం. వారు వాస్తు శాస్త్రానికి అనుగుణంగా దక్షిణం లేదా తూర్పు వైపు గృహాలను ఇష్టపడతారు. దీనికి అనుగుణంగా అతడు భారతీయుల అభిరుచులకు అనుగుణంగా ఇళ్లను నిర్మిస్తూ వారిని ఆకట్టుకుంటున్నాడు.
విలియమ్సన్ కౌంటీలో 53 శాతం ఇళ్ల కొనుగోళ్లతో భారతదేశ వాసులు ముందున్నారు. ఆస్టిన్ నగరం లోపల ట్రావిస్ కౌంటీలో 24 శాతం, ఆస్టిన్ నగరం వెలుపల 18 శాతం, హేస్ కౌంటీలో ఆరు శాతం కొనుగోళ్లతో భారతీయులే ముందున్నారు. అంతర్జాతీయ గృహ కొనుగోలుదారులు గ్రేటర్ ఆస్టిన్ ప్రాంతంలోని ఆస్తులపై ఏప్రిల్ 2021 నుండి మార్చి 2022 వరకు $613 మిలియన్లు వెచ్చించారు. ఆ కాలంలో నివాస విక్రయాల మొత్తం విలువలో 3 శాతం కావడం విశేషం.
"భారతదేశం నుండి చాలా మంది విదేశీ కొనుగోలుదారులు ఆస్తిని కొనుగోలు చేయడానికి అమెరికా తనఖా ఫైనాన్సింగ్ (82 శాతం)ని ఉపయోగిస్తున్నారు. అయితే 12 శాతం కొనుగోళ్లు మొత్తం నగదుతో ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. ఇంకా, భారతీయ కొనుగోలుదారులు డిటాచ్డ్ సింగిల్-ఫ్యామిలీ హోమ్ ప్రాపర్టీ రకం (94 శాతం) , రెసిడెన్షియల్ ల్యాండ్‌పై ఆరు శాతం దృష్టి పెడతున్నారని తేలింది. సెంట్రల్ టెక్సాస్ ప్రాంతం అపార్ట్‌మెంట్‌లు, కాండోల నుండి ఒకే కుటుంబ గృహాల వరకు విభిన్న శ్రేణి గృహాలను నిర్మించి ఇస్తోంది. అందుకే ఇక్కడ భారతీయులు అత్యధికంగా కొనుగోలు చేస్తున్నారు.
భారతీయ కొనుగోలుదారుల్లో 59 శాతం మంది ప్రాథమిక నివాసాలను కొనుగోలు చేస్తున్నారని, 35 శాతం ఇళ్లను అద్దె ఆస్తిగా ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ గృహ కొనుగోలుదారులలో అమెరికాయేతర పౌరులు ఉన్నారు. వారు ఇక్కడ గ్రీన్ కార్డ్‌పై ఉన్నారు. ఇక్కడ విదేశీ పని లేదా విద్యార్థి వీసాపై ఉన్నారు. విదేశీ కొనుగోలుదారులలో సగానికి పైగా అమెరికా గ్రీన్ కార్డ్‌ను కలిగి ఉన్నారని, వారు చట్టబద్ధమైన శాశ్వత నివాసితులని సూచిస్తున్నారని నివేదిక పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.