Begin typing your search above and press return to search.

వలస పక్షుల్లో మనోళ్లే టాప్ అంట

By:  Tupaki Desk   |   17 Jan 2021 12:30 AM GMT
వలస పక్షుల్లో మనోళ్లే టాప్ అంట
X
కన్నతల్లి.. ఉన్న ఊరిని వదిలి వెళ్లడానికి చాలా బాధపడుతారు.. కానీ మనోళ్లకు మాత్రం అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. ఎంచక్కా గాలిమోటార్ ఎక్కి విదేశాలకు చెక్కేస్తున్నారు.

భారత్ నుంచి విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మాతృభూమిని వదిలి విదేశాల్లో స్థిరపడిన వారిలో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారని తాజాగా ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది.

ఐక్యరాజ్యసమితి తాజాగా ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ 2020 రిపోర్ట్ ప్రకారం 2020 నాటికి భారత్ నుంచి 1.80 లక్షల మంది ప్రజలు వేరే దేశంలో నివసిస్తున్నారు.

భారత్ నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు అమెరికా, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాకు తరలివెళుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది.

భారత్‌ నుంచి వలస వెళ్లిన వారిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 30 లక్షల మంది, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది.. అమెరికాలో 27 లక్షల మంది నివసిస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, ఇంగ్లాండ్‌లోనూ అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది.

భారత్ నుంచి అత్యధికంగా గత 20 ఏళ్లలో కోటి మంది విదేశాలకు వెళ్లగా.. 2020 నాటికి 5 కోట్ల మందికి పైగా వలసదారులకు అమెరికా గమ్యస్థానంగా మారింది. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడం గమనార్హం.