Begin typing your search above and press return to search.

ఫోకస్: సెక్స్ టాయ్స్ ఫుల్లుగా వాడుతున్నారట!

By:  Tupaki Desk   |   14 July 2019 1:30 AM GMT
ఫోకస్: సెక్స్ టాయ్స్ ఫుల్లుగా వాడుతున్నారట!
X
హిపోక్రసీ పీక్స్ లో ఉండే సొసైటీలలో మనదేశం ఒకటి. సామాజిక న్యాయం అంటాం.. మన కులానికి మనం ప్రాధాన్యతనిస్తాం. సత్యమేవ జయతే అంటాం.. నోరు తెరిస్తే అబద్దాలు తప్ప నిజాలు రావు. ఇలానే సెక్స్ విషయంలో కూడా చాలా హిపోక్రసీ ఉంది. లోపల చేసేది ఒకటి బైట చెప్పేది ఒకటి.

20 వ శతాబ్దపు గ్రేట్ థింకర్స్ లో ఒకరని ఓషో రజనీష్ కు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. ఆయన ఎన్నో సబ్జెక్ట్స్ గురించి మాట్లాడినా.. హ్యాపీ లైఫ్ కు సీక్రెట్స్ చెప్పినా అవి ఫాలో అవ్వకుండా అయన చుట్టూ ముసురుకున్న వివాదాలపై మాత్రం ఎక్కువమంది ఫోకస్ చేస్తారు. ఆయనను 'సెక్స్ గురు' అంటూ సెక్సుకు పరిమితం చేస్తారు. మెడిటేషన్ కు కొన్ని వందల వేల డెఫినిషన్స్ ఉన్నాయి. కానీ మనం మెడిటేషన్ చెయ్యలేం. కానీ ఓషో చెప్పిన సింపుల్ డెఫినిషన్ ఏంటో తెలుసా..? మీరు మెడిటేషన్ ప్రత్యేకంగా చెయ్యకండి. ఏ పని చేస్తున్నా శ్వాసను (ఉచ్చ్వాస నిశ్వాసలను) గమనించండి.. అంతే. అదే మెడిటేషన్. అది మీరు డ్రైవింగ్ చేస్తున్నపుడూ చెయ్యవచ్చు.. వంట చేస్తున్నప్పుడు చెయ్యవచ్చు.. టీవీ చర్చల్లో పాల్గొని జఫ్ఫా లాజిక్కులు చెప్పేవాళ్ళను బూతులు తిడుతున్నప్పుడూ కూడా చేయొచ్చు. ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ అయన ఎన్నో చెప్పారు కానీ అవి కాదు మనకు కావాల్సింది. ఆయన రాసిన వందలాది బుక్స్ లో ఒకటైన 'సెక్స్ మ్యాటర్స్: ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్ నెస్' ఎందుకంటే అది సెక్స్ మీద రాసిన పుస్తకం.. పైగా వివాదాస్పదమైనది కాబట్టి.

ఎలాగూ హిపోక్రసీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ టాపిక్ కంటిన్యూ చేద్దాం.. మన సొసైటీలో ఇప్పుడు సెక్స్ టాయ్స్ వినియోగం ఉందా లేదా? అని ఎవరినైనా అడిగితే మెజారిటీ జనాలు 'లేదు' అంటారు. ఇంకా మన జనాలందరూ మగాళ్ళయితే చేతులు.. ఆడాళ్ళయితే వేళ్ళు.. వంకాయలతో పని కానిస్తున్నారనే భ్రమలో ఉంటారు!

అర్థం అయిన చిలిపి మారాజులకు సరే.. అర్థం కాని వారు కూడా కొందరు ఉండే అవకాశం ఉంది. సెక్స్ టాయ్స్ ఎందుకు అంటే.. స్వయంతృప్తి కోసం వాడే కృత్రిమమైన వస్తువులు. ఈ ఆర్టిఫిషియల్ ఐటమ్స్ కు ఇండియాలో ఇప్పుడు భారీగా మార్కెట్ ఏర్పడిందట. కారణం ఏంటంటే ఇంతకు ముందు వీటిని కొనాలంటే మాచెడ్డ మోహమాటం.. ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఆన్ లైన్ లో జస్ట్ ఆర్డర్ చేస్తున్నారు. ఆ వస్తువులు ఎంచక్కా ఇంటికి వస్తున్నాయి. ఇంకేముంది.. 'అగ్నిస్ఖలన.. ఛత్రపతి' అని మగాళ్ళు.. 'ఆ ఆ ఆ' అంటూ భావ ప్రాప్తితో ఆడవాళ్ళు రెచ్చిపోతున్నారట. 'లస్ట్ స్టోరీస్' లో వైబ్రేటర్ సీన్ గురించి పెద్ద చర్చ చరిగింది కానీ ఎందుకో జనాలు.. మీడియా కూడా సెక్స్ టాయ్స్ వాడకం పై పెద్దగా ఫోకస్ చెయ్యలేదు.

ముంబై లోని క్రాఫోర్డ్ మార్కెట్.. ఢిల్లీలోని పాలికా బజార్ లో ఈ టాయ్స్ విస్తృతంగా దొరికే షాపులు ఉన్నాయట. ఇక ఈ సెక్స్ టాయ్స్ ను విక్రయించే ప్రత్యేకమైన ఈ కామర్స్ సైట్లు ఉన్నాయి. నిజానికి వీటిని అమ్మడం చట్టవ్యతిరేకమట. అందుకనే అడల్ట్ కేటగిరీ కింద కాకుండా ఎఫ్ఎంసిజీ గూడ్స్ కేటగిరీ కింద అమ్ముతున్నారట. ఐయామ్ బేషరమ్ (in.imbesharam.com).. దట్స్ పర్సనల్ www.thatspersonal.com) లాంటి ఆన్ లైన్ అడల్ట్ స్టోర్స్ లో ఏవి కావాలంటే అవి మొహమాటం లేకుండా కొనుగోలు చేస్తున్నారట.

ఇవే కాకుండా ఇలాంటి సెక్స్ టాయ్స్ అమ్మే ఆన్లైన్ స్టోర్స్ పదుల సంఖ్యలో ఉన్నాయి. కింద ఉన్న లిస్టు ఒకసారి చూడండి.

www.adultproductsindia.com

www.masalatoys.com

www.adultvibes.in

www.fashionlovetoys.in

www.sexpiration.com

www.kaamastra.com

www.adultscare.com

www.kinpin.com

www.deluxetoys.com

సెక్స్ టాయ్స్ లో బేసిక్ ఐటమ్స్ వైబ్రేటర్.. మేల్ మాస్టర్బేటర్. వీటిలో పలు రకాలు ఉన్నాయి. ఇవి కాకుండా చాలా రకాల వేరే టాయ్స్ ఉన్నాయి. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత అని ఊరికే అన్నారా? ఆ సామెత ఇక్కడ కూడా వర్తిస్తుంది. అబ్బాయిల కోసం సిలికాన్ డాల్స్(రెండు లక్షల రూపాయలు ఒక బొమ్మ) లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ సంప్రదాయాలు.. ఆచార వ్యవహారాలు పరిఢవిల్లే మన భారతదేశంలోనే జరుగుతున్నాయి. జనాలు కొనుక్కుంటున్నారు.. యధేచ్చగా వాడుతున్నారు. ఇండియాలో అడల్ట్ సెక్స్ టాయ్స్ మార్కెట్ పోయినేడాది $228 మిలియన్ ఉందట. ఈ ఏడాదికి ఆ మార్కెట్ 34% పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయట. అయితే సోషల్ మీడియా పోస్టుల్లో "హే డ్యూడ్ జస్ట్ ఎజాక్యులేషన్ అయింది".. "హుర్రే డబల్ ఆర్గాజం" అంటూ స్టేటస్ పెట్టడం లేదంతే!