Begin typing your search above and press return to search.

అమెరికా యావతో భారతీయుల అడ్డదారులు.

By:  Tupaki Desk   |   30 Sept 2018 4:28 PM IST
అమెరికా యావతో భారతీయుల అడ్డదారులు.
X
అమెరికా.. ప్రపంచ అగ్రదేశం.. ఆ కలల దేశంలోకి ఎంట్రీ ఇవ్వడానికి భారతీయులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావట.. ట్రంప్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడంతో ఇప్పుడు ఎలాగైనా సరే అమెరికాలో అక్రమంగానైనా ప్రవేశించాలని పెద్ద పెద్ద ప్లాన్లే వేస్తున్నారట.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య ఏటికేడాది పెరుగుతోందని.. గతేడాదికి ఈ ఏడాదికి మూడు రెట్లు పెరిగిందని తాజాగా అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) విభాగం ప్రకటించింది. భారతీయులు ముఖ్యంగా అమెరికా - మెక్సికో సరిహద్దు ను అక్రమంగా దాటి వస్తున్నారని నివేదిక ఇచ్చింది. ఇందుకోసం 25 నుంచి 50వేల డాలర్లను మనుషుల స్మగ్లింగ్ ముఠాలకు ముట్టజెప్పుతున్నట్టు వెల్లడైంది.

ఇలా దొంగతనంగా ప్రవేశించిన ఇండియన్లను పట్టుకున్న పోలీసులకు స్వదేశాల్లో హింస - పీడనను ఎదుర్కొంటామని.. బాండ్లు కట్టి మానవ అక్రమ రవాణా చేసినందుకు భారీగా జరిమానా కడుతున్నట్టు తెలిసింది. అమెరికాలోకి ప్రవేశించాక పెద్ద పెద్ద ఉద్యోగాలు - హోటళ్లు - ఇతర స్టోర్లలో పనిచేస్తూ వచ్చిన డబ్బులతో బాండ్ ఫీజు రుసుం చెల్లిస్తూ అక్రమంగా ఇక్కడే ఉండిపోతున్నారని నివేదికలో తెలిపారు.

సెప్టెంబర్ 30తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 9వేల మంది భారతీయులు సరిహద్దుల్లో అరెస్ట్ అయ్యారని సీబీపీ అధికారి సాల్వడర్ జమోరా వెల్లడించారు. గతేడాది 3162 మంది మాత్రేమే రాగా.. ఈ సారి సంఖ్య మూడు రెట్లు అయ్యింది. వీరంతా అమెరికాలోకి మెక్సికాలి సరిహద్దు కంచెను దాటి వచ్చినట్టు పోలీసులు గుర్తించారని వివరించారు. రకరకాల పీడన - కులాంతర వివాహాలతో చనిపోతామనే భయంతో వలస వస్తున్నట్లు అబద్ధాలు చెబుతున్నారని వివరించారు. అందుకే తాజాగా 2012-17 మధ్యకాలంలో ఆశ్రయం కోసం అమెరికాలో అర్జీలు పెట్టుకున్న 42.2 శాతం భారతీయుల విజ్ఞప్తులను తోసిపుచ్చినట్టు సైకాక్యూస్ యూనివర్సిటీ ట్రాన్సాక్షనల్ రికార్డ్ యాక్సెస్ క్లియరింగ్ హౌస్ తెలియజేసింది. అమెరికాలోకి అక్రమంగా వలసవచ్చే వారిలో అత్యధికంగా 79శాతంతో ఎల్ సాల్వడర్ వాసులు మొదటిస్థానంలో ఉండగా.. 78శాతంతో హ్యూండరస్ వాసులు రెండో స్థానంలో ఉన్నారు.