Begin typing your search above and press return to search.
ఆస్తులు కొనాలంటే వాస్తు పక్కానంట
By: Tupaki Desk | 8 Dec 2015 10:30 PM GMTదేవుడు.. దెయ్యం..ఇలాంటివి పెద్దగా నమ్మను. నాకు నచ్చినట్లుగా నేను బతుకుతా అంటూ చెప్పేవాళ్లు మన చుట్టూనే చాలామంది కనిపిస్తారు. మాటలు ఉన్నంతగా.. వ్యవహారాలు ఉండవన్న విషయం తాజాగా తేలిసింది. తాము నమ్మకాలకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వమని పలువురు చెబుతుంటారు. కానీ.. అదేమీ వాస్తవం కాదన్న విషయం తాజాగా జరిపిన ఒక సర్వేలో స్పష్టమైంది.
ప్రముఖ ప్రాపర్టీ పోర్టల్ హౌసింగ్ డాట్ కామ్ తాజాగా ఒక సర్వేను నిర్వహించింది. ఆస్తుల కొనుగోళ్ల విషయంలో ఏ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయంపై దృష్టి సారించింది. మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి.. ఆస్తుల వివరాలు తెలిసిన మరుక్షణం మొదట వాకబు చేసేది వాస్తు గురించేనట. వాస్తు ఓకే అయితే.. మిగిలిన అంశాల మీద దృష్టి పెడుతున్నారట.
ఇలా వాస్తుకు ప్రాధాన్యత ఇస్తే వారు నూటికి 93 శాతం మంది ఉండటం గమనార్హం. ప్రతి ఐదుగురిలో నలుగురు తాము కొనే ఆస్తికి సంబంధించిన వాస్తు ఎలా ఉందన్న విషయాన్ని తొలుత తెలుసుకుంటారట. ఆ తర్వాతే కొనుగోలు వ్యవహారం మీద దృష్టి సారిస్తారట. అంతేకాదు.. వాస్తుకు సంబంధించిన వివరాల్ని.. తమకు తెలిసిన వారి ద్వారా మొదట కనుక్కున్నాకనే.. వాటిని చూసేందుకు మొగ్గు చూపటం మరో విశేషంగా చెప్పాలి.
ఒకవేళ వాస్తు కానీ బాగుంటే.. మిగిలిన విషయాల్లో కాస్త రాజీ పడే వైఖరి కూడా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇక.. వాస్తుకు అమితంగా ప్రాధాన్యత ఇస్తే వారి విషయానికి వస్తే.. వ్యాపారులు వాస్తును పూర్తిస్థాయిలో నమ్ముతారట. వాస్తు ఓకే అయితే కానీ.. మిగిలిన విషయాల జోలికి వెళ్లరట.