Begin typing your search above and press return to search.
బ్రిటన్ లోనూ రియల్ బూమ్..కొనేవాళ్లలో మనోళ్లే టాప్
By: Tupaki Desk | 14 Feb 2019 7:00 AM ISTమన వాళ్ల నైజమే అంత. ఎక్కడికి వెళ్లినా కూడు - గుడ్డ - తిండికి డోకా లేకుండా చూసుకుంటారు. అది ఇండియా అయినా, అమెరికా అయినా - లండన్ అయినా. మనవాళ్లు విదేశాలకు వెళ్లి చదువుకుని అక్కడే మంచి ఉద్యోగాలు చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. ఒకప్పుడు విదేశాలకు వెళ్లి బాగా సంపాదించుకున్న తర్వాత ఇండియా వచ్చి సెటిల్ అయ్యేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయి.. అక్కడే సెటిల్ అయిపోతున్నారు. దీంతో.. ఉన్న చోటే స్థలాలు కొనడం మొదలుపెడుతున్నారు.
మనవాళ్లు స్థలాలు కొనడం మొదలుపెడితే.. సెంట్లు - గజాల్లో కొనరు. ఏకంగా ఎకరాల్లో కొంటారు. సగంలో ఇల్లు కట్టుకున్నా మిగతా సగం డెవలప్ మెంట్ కు ఇచ్చి ఇన్ కం సంపాందించుకోవచ్చని అద్భుతమైన తెలివితేటలు మనవాళ్లుకు ఉంటాయి. అందుకే.. యూకేలో స్థిరపడిన భారతీయులు గత రెండేళ్లలో విచ్చలవిడిగా స్థలాన్ని కొనేశారు. అసలు మనవాళ్లు బ్రిటన్ లో స్థలాలు ఏ రేంజ్ లో కొన్నారంటే.. మన వాళ్ల దెబ్బకు అక్కడి స్థలాలకు ఫుల్ రేట్లు వచ్చేశాయి. దీంతో.. స్థానికంగా ఉండే బ్రిటీషర్లకు ఇప్పుడు స్థలాలు దొరకని పరిస్థితి. అందుకే బ్రిటన్ ప్రభుత్వం మనవాళ్లని కట్టడి చేసేందుకు ఒక శాతం పన్ను (స్టాంప్ డ్యూటీ) విధించింది. దీనివల్ల అయినా మనవాళ్లు కాస్త తగ్గుతారని. ఈ పన్ను ద్వారా వచ్చే డబ్బుతో బ్రిటన్‌లో రోడ్లపై పడుకునే వారికి ఇళ్లు కట్టించే ఆలోచనలో ఉంది బ్రిటన్ ప్రభుత్వం. 200 ఏళ్ల క్రితం బ్రిటీష్ వాళ్లు మనల్ని మన ఇండియాకు వచ్చి మన స్థలాలు ఆక్రమించుకుంటే.. మనం మాత్రం దర్జాగా వెళ్లి వాళ్ల దగ్గరే సంపాదించి.. వాళ్ల అస్తుల్నే కొంటున్నాం. ఏదైనా ఇండియన్స్ ఆర్ రాకింగ్. అంతే..