Begin typing your search above and press return to search.

అమెరికా అంటే అంత ఆస‌క్తి చూపించ‌ట్లేద‌ట‌!

By:  Tupaki Desk   |   7 Jun 2019 11:36 AM IST
అమెరికా అంటే అంత ఆస‌క్తి చూపించ‌ట్లేద‌ట‌!
X
బాగా చ‌దువుకోవాలి. ఆ వెంట‌నే అమెరికాలో ఉద్యోగంలో చేరాలి. గ‌డిచిన కొన్నేళ్లుగా యూత్ లో ఈ మాట చాలామంది నోట వినిపించే ప‌రిస్థితి. అమెరికాలోని ప్ర‌భుత్వాల తీరు పుణ్య‌మా అని.. అమెరికా మీద ఆశ‌ల్ని కొంచెం కొంచెం త‌గ్గించుకోవ‌ట‌మే కాదు.. అమెరికాలోనే జాబ్ చేయాల‌న్న ఆస‌క్తి కూడా ఉండ‌టం లేద‌న్న కొత్త విష‌యం తాజాగా జ‌రిపిన అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.

ఉన్న‌త చ‌దువైనా.. ఉద్యోగ‌మైనా ఫ‌స్ట్ ఆప్ష‌న్ అమెరికా.. ఆ త‌ర్వాతే మిగిలిన దేశాలుగా చెబుతున్న ప‌రిస్థితి. అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత అమెరికాకు వెళ్లాల‌నుకున్న వారి మీద భారీ ఎత్తున ఆంక్ష‌లు పెడుతున్న వైనం మారిన ఆలోచ‌న‌ల‌కు కార‌ణంగా చెబుతున్నారు.

ఇండీడ్ ఎక‌న‌మిస్ట్ ఆండ్రూ ఫ్ల‌వ‌ర్స్ అనే సంస్థ జ‌రిపిన అధ్య‌య‌నం ప్ర‌కారం గ‌డిచిన ఏడాదిలో అమెరికాలో ఉద్యోగాలు పొందే వారి సంఖ్య త‌గ్గిన‌ట్లుగా పేర్కొన్నారు. అమెరికా విధిస్తున్న రూల్స్ తో పాటు.. వీసా విధానాలు కూడా కార‌ణంగా చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. అమెరికా అంటే అదివ‌ర‌కు మాదిరి భార‌తీయుల్లో పెద్ద ఆస‌క్తి వ్య‌క్తం కావ‌ట్లేద‌ని.. కానీ ప‌లు దేశాల్లో మాత్రం అమెరికా అంటే క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదన్న విష‌యాన్ని వెల్ల‌డించారు.

అమెరికాలో జాబ్ కోసం వెళ్లే వారిలో భార‌త్.. పాక్.. యూకే దేశాలే ఎక్కువ‌గా ఉండేవి. ఈ మ‌ధ్య కాలంలో జ‌ర్మ‌నీ.. ఫిలిప్పీన్స్.. ర‌ష్యా.. ఫ్రాన్స్ దేశాల‌కు చెందిన యువ‌త కూడా అమెరికా మీద గురి పెట్టిన‌ట్లుగా వెల్ల‌డించింది. ఇటీవ‌ల కాలంలో మారిన వీసా నిబంధ‌న‌ల‌తో పాటు.. చ‌ట్టాల నేప‌థ్యంలో అమెరికా కంటే ఇత‌ర దేశాల మీద భార‌తీయులు దృష్టి సారిస్తున్న‌ట్లుగా తాజా గణాంకాలు స్ప‌స్టం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ మ‌రింత పెరిగే వీలుంద‌న్న మాట వినిపిస్తోంది.