Begin typing your search above and press return to search.

భార‌తీయుల మృత్యువాత‌: బ్రిటీష్ రాజ్యంలో క‌రోనాకు వెయ్యి మందికి పైగా

By:  Tupaki Desk   |   27 April 2020 5:30 PM GMT
భార‌తీయుల మృత్యువాత‌: బ్రిటీష్ రాజ్యంలో క‌రోనాకు వెయ్యి మందికి పైగా
X
కరోనా వైరస్ మాన‌వ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. అగ్ర‌రాజ్యం.. పేద దేశం అని చూడ‌కుండా అన్ని దేశాల‌ను ఆ వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తోంది. దీని బారిన ప‌డిన ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు అనారోగ్యంతో స‌త‌మ‌త‌మ‌వుతుంటే వేల సంఖ్య‌లో మృత్యువాత ప‌డుతున్నారు. భార‌త‌దేశంలో కూడా అదే ప‌రిస్థితి ఉంది. 30 వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు ఉన్నాయి. ప్ర‌పంచంలోని దాదాపు అన్ని దేశాల్లో భార‌తీయులు ఉన్నారు. చాలా దేశాల్లో అధిక సంఖ్య‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయా దేశాల్లో ప్ర‌బ‌లుతున్న క‌రోనా వ‌ల‌న భార‌తీయులు కూడా దాని బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో భార‌తీయులు కూడా మృత్యువాత ప‌డుతున్నారు. అయితే దీనిపై లెక్క‌లు ఇప్పుడిప్పుడే రావ‌డం లేదు. ప్ర‌స్తుతం అమెరికాతోపాటు బ్రిటన్‌ లో అత్య‌ధికంగా భార‌తీయులు పెద్ద సంఖ్య‌లో ప‌డ్డార‌ని స‌మాచారం. వీటిలో ఒక్క బ్రిట‌న్ (యూకే)లోనే దాదాపు వెయ్యి మందికి పైగా భార‌త ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డ్డార‌ని తెలుస్తోంది.

బ్రిటన్‌ లో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ధాటికి ఆ దేశంలో భారతీయులు వెయ్యి మందికి పైగా మృతిచెందారు. ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. ఆ దేశం‌లో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 20,732. అయితే ఇది అధికారికంగా వ‌చ్చిన స‌మాచారం. అనధికారికంగా మ‌రికొంత‌మంది ఉంటారు. ఈ లెక్క‌లో కూడా కొంత జిమ్మిక్కులు దాగి ఉన్నాయి. ఇళ్ల‌ల్లో మృతిచెందిన వారిని - ఇంటెన్సివ్ కేర్‌ లో మ‌ర‌ణించిన వారి లెక్క‌ల‌ను ప‌రిగ‌ణించ‌డం లేదు. వీటిని కూడా క‌లిపితే మృతుల సంఖ్య భారీగా ఉండే అవ‌కాశం ఉంది. దీంతో పాటు బ్రిటన్‌ లో మైనార్టీలుగా ఉన్న ఇతర దేశాల వారు ఎంతమంది మృతి చెందారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.

వాస్త‌వంగా బ్రిటన్‌ లో భారతీయుల జనాభా 1.5 మిలియన్. బ్రిటన్‌ లోని ప్ర‌ధాన న‌గ‌రం లండన్‌ లోనే అత్య‌ధికంగా మంది భార‌తీయులు స్థిర‌ప‌డ్డారు. భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కరోనా వైరస్ తీవ్రంగా ఉంది. పెద్ద సంఖ్య‌లో భార‌తీయులు మృతి చెందుతుండ‌డంతో అక్క‌డ సంప్ర‌దాయ ప్ర‌కారం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ దేశంలో భారతీయ పురోహితులకు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. దీని చూస్తేనే అర్థ‌మ‌వుతోంది భారతీయుల మరణాల రేటు ఎలా ఉందో. క‌రోనా మృతుల విష‌యాల‌ను శ్మ‌శాన వాటికలు - ఆలయాలు - గురుద్వారాలు స‌మాచారం ఇస్తున్నాయి. ఈ విధంగా బ్రిట‌న్‌ లో క‌రోనా బారిన భార‌తీయులు పెద్ద సంఖ్య‌లో మృతిచెంద‌డం క‌ల‌వ‌రం రేపుతోంది. బ్రిట‌న్‌ లో భార‌త్ త‌ర్వాత పాకిస్తానీయులు అధికంగా ఉన్నారు. వారు కూడా ఈ వైర‌స్ బారిన ప‌డి మృతి చెందుతున్నారు. ఆ లెక్క‌లు కూడా భారీగా ఉన్నాయి.