Begin typing your search above and press return to search.

అమెరికాలో విస్తరిస్తున్న భారతీయులు..

By:  Tupaki Desk   |   7 Sep 2022 2:30 AM GMT
అమెరికాలో విస్తరిస్తున్న భారతీయులు..
X
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా అంతటా భారతీయులు ఉండనే ఉంటారు. ప్రపంచంలోని 210 దేశాల్లో భారతీయులు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. అంటే దాదాపు ఒకటి ఆరా దేశాలు తప్పితే అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. అత్యధికంగా ప్రవాస భారతీయులు ఉన్న దేశం ఏంటో తెలుసా? ‘యూఏఈ’. భారతీయులకు ఈ గల్ఫ్ దేశం మరో ఇల్లులా మారిందంటే అతిశయోక్తి కాదు.

ఇక అమెరికాలో భారతీయుల జనాభా వేగంగా పెరుగుతోంది. ఇక ఆ దేశంలో బాగా సంపాదన పరులుగా ఇండియన్లు ఎదుగుతున్నారు. అక్కడ ఉద్యోగం కోసం వెళ్లి స్థిరపడి సంపాదిస్తూ వివిధ రంగాల్లోకి వెళ్లి ఆర్థికంగా స్థిరపడుతున్నారు. ఉద్యోగం తర్వాత ఇల్లు,, ఫ్యామిలీ.. ఆ తర్వాత వివిధ రంగాల్లోకి పెట్టుబడులు పెట్టి ఇండియన్స్ ఇప్పుడు రాజకీయంగానే అమెరికాలో ఎదుగుతున్నారు.

అమెరికాలోని పలు నగరాలు ఇండియన్స్ జనాభాతో నిండిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు.. మార్నింగ్ వాక్.. వివిధ భారతీయ వేడుకలు చూస్తే భారతీయులు విపరీతంగా కనిపిస్తున్నారు. ఏదైనా సమూహాన్ని చూస్తే అందులో కనీసం ఒక్కరైనా భారతీయులు కనిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

స్వతహాగా అక్కడున్న అమెరికన్స్.. ఆఫ్రికన్ అమెరికన్స్ తమ వరకూ సంపాదించి పిల్లలను వారికి వారే సంపాదించుకోవాలని గాలికి వదిలేస్తారు. కానీ ఇండియన్స్ మాత్రం పిల్లలకు , వారి పిల్లలకు, మనవల వరకూ బాధ్యత తీసుకొని సంపాదించుకుంటూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు.

ఇక ఇండియన్స్ భారతీయ సంబంధాలనే కాదు.. అక్కడి అమెరికన్స్ ఇతర దేశాల వారిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోతున్నారు. మునుపటిలా మడికట్టుకొని భారతీయ సంబంధమే కావాలని కూర్చోవడం లేదు.

అమెరికాకు వెళ్లినా అక్కడ అమెరికన్లుగానే జీవించడానికి యోచిస్తున్నారు. కొన్నేళ్లు సంపాదించుకొని వచ్చి ఇక్కడ భారత్ లో సెటిల్ అయిపోదామని ఆలోచించడం లేదు.

అయితే అమెరికాలో భారతీయుల సంపాదన చూసి వారిపై విద్వేష రాజకీయాలు నడుస్తున్నాయి. వారిపై దాడులకు తెగబడుతున్నారు. సంపదను దోచుకెళుతున్నారు. ఇది కూడా ఓ రకంగా భారతీయులకు ముప్పుగానే పరిగణిస్తోంది. అక్కడ మమేకమై బతకలేకపోతే ఇలాంటి విద్వేషాలు రగిలి అసలుకే మోసం వస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.