Begin typing your search above and press return to search.

బ్రిటన్‌ 'గోల్డెన్‌ వీసా' రద్దు... ఇండియ‌న్ల‌ కు షాకే

By:  Tupaki Desk   |   8 Dec 2018 5:13 AM GMT
బ్రిటన్‌ గోల్డెన్‌ వీసా రద్దు... ఇండియ‌న్ల‌ కు షాకే
X
ఇటీవ‌లి కాలం లో వివిధ దేశాలు వీసాల విష‌యంలో క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తుండ‌గా... ఇదే ఒర‌వ‌డి లో బ్రిటన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఇది నైపుణ్య‌వంతులు ఆదార‌ప‌డే వీసా కాదు. భార‌తీయ కోటిశ్వ‌రులు ఎక్కువ‌ గా ఎదురుచూసే వీసా. తమ దేశం లో పెట్టుబడులు పెట్టే విదేశీ కోటీశ్వరులకు శాశ్వత నివాసం, పౌరసత్వం కోసం జారీచేస్తున్న గోల్డెన్‌ వీసా (టైర్‌-1 ఇన్వెస్టర్‌ వీసా)ను తాత్కాలికంగా రద్దు చేసినట్టు బ్రిట‌న్ ప్రకటించింది. గోల్డెన్‌ వీసా దుర్వినియోగం అయ్యే అవకాశమున్న నేపథ్యం లో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటూ శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది.

బ్రిట‌న్ తాజా గా ర‌ద్దు చేసిన గోల్డెన్‌ వీసా లో ప్రధానంగా మూడు కేటగిరీలు ఉన్నాయి. బ్రిటన్‌లో 2 మిలియన్‌ పౌండ్లు ( రూ.18,12,55,173 ) పెట్టుబడి పెట్టే విదేశీయులు తొలుత 40 నెలలు ఉండేందుకు అధికారులు అనుమతిస్తారు. దీన్ని మరో రెండేళ్ల‌ పాటు పొడిగించుకోవచ్చు. వీరికి ఐదేళ్ల‌ అనంతరం బ్రిటన్‌ లో శాశ్వత నివాస హోదా(ఐఎల్ఆర్‌)ను కల్పిస్తా రు. ఈ పెట్టుబడిదారులు తమ భార్య తో పాటు 18 ఏళ్ల‌ లోపు ఉండే తమ పిల్లల్ని బ్రిటన్‌ కు తీసుకురా వచ్చు. అలాగే బ్రిటన్‌ లో 5 మిలియన్‌ పౌండ్లు ( రూ.45,30,11,900 ) పెట్టుబడి పెట్టే వారికి మూడేళ్ల‌ లో 10 మిలియన్‌ పౌండ్లు ( రూ.90,68,96,741 ) పెట్టుబడి పెడితే రెండు సంవ‌త్స‌రాల్లో శాశ్వత నివాస హోదా లభిస్తోంది. గోల్డెన్‌ వీసా కింద మొదటి కేటగిరి వ్యాపారవేత్తలు ఆరేళ్ల‌ తర్వాత, మిగిలినవారు ఐదేళ్ల‌ అనంతరం బ్రిటన్‌ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

భారత్‌, రష్యా, చైనా సహా పలు దేశాలకు చెందిన విదేశీయులు ఈ గోల్డెన్‌ వీసా ద్వారా బ్రిటన్‌లో స్థిరపడుతున్నారు.తాజా గా వీసా ర‌ద్దు ద్వారా వీరి పై ప్ర‌భావం ప‌డనుంది. అయితే, నైపుణ్య‌వంతులు, ఉద్యోగార్థులు ఈ వీసాను ఎక్కువ‌ గా ప్రాధాన్య‌ప‌ర‌మైన అంశంగా తీసుకోని నేప‌థ్యం లో తాజా గా బ్రిట‌న్ స‌ర్కారు నిర్ణ‌యం పెద్ద దెబ్బ వంటిదేం కాద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే, ఈ ప‌రిణామంతో మిగ‌తా విభాగాల్లోని వీసాల‌ను సైతం స‌మీక్షించే అవ‌కాశం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.