Begin typing your search above and press return to search.
గతం లో మాదిరి ప్రవాసులు పుట్టిన దేశ పురోగతికి ప్రయత్నించాలి!
By: Tupaki Desk | 15 Aug 2022 4:32 PM GMTప్రపంచీకరణ కారణంగా.. దేశాలకు దేశాలే కుగ్రామంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఉపాధి, ఉద్యోగాలను వెతుక్కుంటూ.. పక్క ఊరు వెళ్లినంత తేలికగా.. ఇప్పుడు.. ప్రపంచ దేశాలకు వెళ్లి పోతున్నారు. ఇక, వ్యాపారాలు.. వాణిజ్యాలను కూడా ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్నారు. దీనికి తన మన అనే తేడా లేమీ లేవంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో దుబాయ్‌లో ప్రపంచ స్థాయి నిర్మాణాలు చేపట్టే.. స్థాయికి భారతీయులు ఎదిగిపోయారు. ఎక్కడో భారీ ఎత్తున పెట్టు బడులు పెట్టే రేంజ్ కు కూడా చేరుకున్నారు.
ఇదంతా కూడా.. మారుతున్న కాలానికి.. అందుబాటు లోకి వచ్చిన ఆధునిక వ్యవస్థలకు దర్పణం పడుతోంది. అయితే.. రాయప్రోలు సుబ్బారావు చెప్పినట్టు ఏదేశమేగినా..ఎందు కాలిడినా.. అన్నట్టుగానే మన భార తీయులు ఎక్కడున్నా.. భరత మాతను.. భారత పుడమిని.. ఈ దేశ త్యాగ ధనులను ఎప్పటికీ మరిచి పోలేదు. మరిచి పోలేరు కూడా! ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాన్ని ప్రపంచ దేశాల్లోనూ భారతీయ సంతతి పౌరులు, ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు.
భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వందనం చేశారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు.. అనేక దేశాల్లోని భారతీయ పౌరులు.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన సందర్భాన్ని పుర స్కరించుకుని.. ఆనంద డోలికల్లో మునిగితేలారు. ఇంత వరకు బాగానే ఉంది. దేశభక్తి ఎక్కడున్నప్పటికీ.. చెక్కు చెదరకుండా.. కాపాడు కోవాల్సిందే. అయితే.. ఇక్కడితోనే ఇంతటి తోనే పని అయిపోయిందా? జెండా వందనం చేసిన చేతులతో స్వదేశానికి ఏమైనా.. చేసేది ఉందా? లేదా? అనేది ఇప్పుడు తెరమీదికి వచ్చిన కీలక ప్రశ్న.
ఎందుకంటే.. గతంలో కంటే కూడా.. ఇప్పుడు.. భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్న వారు.. ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న వారు.. పెరిగారనడంలో సందేహం లేదు. అమెరికా కావొచ్చు... ఆస్ట్రేలియా కావొచ్చు.. బ్రిటన్ కావొచ్చు.. ఏదేశమైనా.. సరే.. అభివృద్ధి కోసం వెళ్తున్నారు. అక్కడ స్థిరపడుతున్నారు. గతం లో ఎక్కువ శాతం సంపాదించింది తీసుకొని వచ్చి ఇండియా లో పెట్టుబడులు పెట్టి మన దేశానికీ ప్రత్యక్షం గా మరియు పరోక్షం గా మన ఆర్ధిక వ్యవస్థ కి సపోర్ట్ చేసేవారు. కానీ, ప్రస్తుత కాలం లో కొంత వరకు భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి . ప్రస్తుతం ప్రవాస భారతీయులు మన దేశం లో కంటే విదేశాల్లో పెడుతున్న పెట్టుబడులు.. పెరుగుతున్నాయి.
ఆయా దేశాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆహార, సర్వీస్, ఎలక్ట్రానిక్స్.. వంటి రంగాల్లో భారతీయ ప్రవాసులు.. పెట్టుబడులు పెడుతున్నారు. మరి అదే సమయంలో భారత్ లోనూ.. పెట్టుబడులు పెట్టొచ్చుకదా? అనేది ప్రశ్న. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా.. మాతృభూమి రుణం తీర్చుకున్నట్టు అవుతుందని.. అదే సమయంలో తాండవిస్తున్న నిరుద్యోగానికి అంతో ఇంతో ఫుల్ స్టాప్ పెట్టినట్టు కూడా అవుతుందని అంటున్నారు పరిశీలకులు.
ప్రభుత్వాల పరంగా కూడా!
ఇంతక ముందు ఎలా అయితే ప్రవాసులు పెట్టుబడులు పెట్టేలా.. భారత్‌లో పారిశ్రామికంగా వారు అభివృద్ధి చెందేలా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాల్సిన అవసరం ఉందనేది వాస్తవం. ఎందుకంటే.. జీఎస్టీ.. సహా ఇతర పన్నుల ను తగ్గించడం.. ద్వారా.. పన్నుల భారం నుంచి ఉపశమనం కల్పించడం ద్వారా.. ప్రభుత్వాలు కూడా ఎన్నారైలకు సహకరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.