Begin typing your search above and press return to search.
అమెరికా ‘మేధావుల్లో’ మనోళ్లే ఎక్కువ
By: Tupaki Desk | 15 Jan 2016 6:59 AM GMTదేశం కాని దేశం వెళ్లి జెండా పాతటం అంత తేలికైన వ్యవహారం కాదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విద్య కోసం ఉపాధి కోసం అమెరికాకు వెళ్లే భారతీయులు తమ సత్తా చాటటమే కాదు.. అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. పేరుకు అమెరికానే కానీ.. అక్కడి సైంటిస్టులు.. వైద్యులు.. సాంకేతిక నిపుణులు.. కంప్యూటర్ నిపుణులు.. ఇంజనీర్లు ఇలా ముఖ్యమైన రంగాలకు సంబంధించి కీలకమైన స్థానాల్లో చాలావరకూ ఉన్నది భారతీయులేనని చెబుతున్నారు. భారత్ తో పాటు ఆసియా దేశాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్న విషయం తాజాగా వెల్లడైంది.
ఆసియా దేశాల నుంచి వలస వస్తున్న వారే అమెరికాలో ఉన్నారని.. అన్ని రంగాల్లో వారే ముందున్నట్లుగా తేలింది. అమెరికాలో వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు.. ఇంజనీర్లు దాదాపు గా 29 లక్షల మంది ఆసియా దేశాలకు చెందిన వారు ఉంటే.. వారిలో 9.5లక్షల మంది భారతీయులేనని తేలింది. 2003 నుంచి 2013 మధ్య కాలంలో అమెరికాకు వెళ్లే భారతీయుల వృద్ధిరేటు 85 శాతంగా నమోదు కావటం గమనార్హం.
మరోవైపు ప్రపంచంలో వివిధ దేశాలకు వలస పోతున్న వారిలో భారతీయుల సంఖ్యచాలా ఎక్కువగా ఉందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మొత్తంగా 1.6కోట్ల మంది భారతీయులు ఉన్నట్లు తేలింది. 2000తో పోలిస్తే 2015 నాటికి ప్రపంచ వలస జనాభా 41 శాతం పెరిగిందని.. యూరప్ లో వలస జనాభా 7.6కోట్లు కాగా.. ఆసియాలో 7.5కోట్లుగా తేల్చారు.
ఇక.. ప్రపంచంలో అత్యధిక వలసలు పోతున్న దేశాల విషయానికి వస్తే.. భారత్ నుంచి వివిధ దేశాలకు వలస వెళ్లిన వారు (1.6కోట్లు) కాగా.. ఆ తర్వాత స్థానంలో మెక్సికో నిలించింది. మెక్సికన్లు (1.2కోట్లు).. రష్యన్లు(1.1కోట్లు).. చైనీయులు (95లక్షలు).. బంగ్లాదేశీయులు(72లక్షలు).. పాకిస్థానీయులు (59లక్షలు).. ఉక్రెయిన్స్ (58 లక్షలు) ఉన్నట్లు తేల్చారు. ప్రపంచంలోని పలు దేశాల వారు వివిధ కారణాల వల్ల వలస వెళుతున్నట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది.