Begin typing your search above and press return to search.
బ్రిటన్ లో 'ఆ' దాతలు భారతీయులేనంట
By: Tupaki Desk | 4 Sep 2015 5:29 AM GMTఊహించని కథాంశంతో.. ఆ మధ్య విడుదలై.. సూపర్ సక్సెస్ అయిన విక్కీ డోనార్ సినిమా గుర్తుందా? అందులో హీరో.. సంతానలేమితో ఇబ్బంది పడే వారికి పిల్లలు పుట్టేందుకు అవకాశం కల్పిస్తూ.. తన వీర్యాన్ని దానంగా ఇస్తుంటాడు. వినటానికి విచిత్రంగా ఉన్నా.. ప్రాశ్చాత్య దేశాల్లో సంతానలేమితో పలు ఇబ్బందులు పడుతున్న వారు ఎంతో మంది ఉంటారు.
పెరిగిన సాంకేతికత సాయంతో.. దాతల వివరాలు తెలియకుండా.. వారిని కలవకుండా.. చూడకుండానే.. వారి వీర్యాన్ని తీసుకొని సంతానం పొందే వీలుంది. బ్రిటన్ లో ఇలాంటి దాతల సంఖ్య ఈ మధ్య పెరుగుతుంది. సంతానలేమితో ఇబ్బంది పడుతున్న బ్రిటన్ దేశస్తులకు సంతానప్రాప్తిని కల్పిస్తూ.. వీర్యాన్ని దానం చేస్తున్న వారిలో భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉందని తాజాగా వెల్లడైన ఒక పరిశోధన చెబుతోంది.
2009 నుంచి 2013 మధ్య కాలంలో తమ వీర్యాన్ని దానంగా ఇస్తామంటూ ఆసక్తి చూపిన వారిలో ఇండియన్లే అత్యధికమని చెబుతున్నారు. 52 మంది భారతీయ యువకులు.. తమ వీర్యాన్ని దానం ఇచ్చేందుకు తమ పేర్లను రిజిష్టర్ చేసుకున్నారు. వీరి తర్వాత వీర్యాన్ని దానం చేసేందుకు మక్కువ ప్రదర్శిస్తున్న వారిలో ఐరీశ్ యువకులు ఉన్నారు. వారు మొత్తం 34 మంది తమ పేర్లను నమోదు చేసుకున్న వారున్నారు.
ఇలా వీర్యాన్ని దానం చేసే వారిలో పాకిస్తానీయులు.. చైనీయులు.. ఆఫ్రికన్లు..ఉన్నారు. ఒక్క వీర్యం మాత్రమే కాదు.. మహిళలు కూడా తమ అండాలను దానం ఇచ్చేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పురుషుల మాదిరే.. మహిళల్లో కూడా భారతీయ మహిళలే ఫలదీకరణ కోసం తమ అండాల్ని దానం ఇచ్చేందుకు ముందుకు రావటం విశేషంగా చెబుతున్నారు. తమ అండాల్ని ఇచ్చేందుకు దాదాపు 57 మంది భారతీయ మహిళలు తమ అంగీకారాన్ని తెలిపినట్లుగా చెబుతున్నారు.
తాజాగా ఫలదీకరణంతో బ్రిటన్ జనాభా పెరుగుదల ఈ మధ్యకాలం జోరందుకుందని చెబుతున్నారు. ఆ దేశంలో గంటకు 48 మంది జన్మిస్తున్నట్లు చెబుతున్నారు. గడిచిన 40 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున పిల్లలు పుట్టటం ఈ మధ్యనే అని చెబుతున్నారు.