Begin typing your search above and press return to search.

అమెరికాలో మనోళ్ల పరిస్థితి అంత దారుణమా!

By:  Tupaki Desk   |   7 Oct 2020 9:15 AM IST
అమెరికాలో మనోళ్ల పరిస్థితి అంత దారుణమా!
X
కరోనా ప్రభావంతో అమెరికాలో ఉంటున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. ప్రస్తుతం ఉపాధి కోల్పోయి మరింత ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో అమెరికాలో ఉంటున్న భారతీయల పరిస్థితి మరింత దయనీయంగా మారబోతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో పేదల శాతం 6.5 శాతంగా ఉన్నట్లు సమాచారం. అయితే 'ది ఇన్విసిబుల్ ఇండియన్' నివేదిక ప్రకారం ఈ ఏడాది చివరికల్లా పేదల శాతం 10.1 శాతానికి పెరిగినట్టు సమాచారం. ఇండయోస్పొరా అనే ప్రవాస భారతీయుల అంతర్జాతీయ సంఘం ఈ నివేదికను విడుదల చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న భారతీయులు ఏడాదికి 1.2 లక్షల డాలర్ల (భారత కరెన్సీలో 87 లక్షలు) దాకా సంపాదిస్తున్నారు. అమెరికా ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌ ప్రొఫెసర్ దేవేశ్ కపూర్ అధ్యయనం చేసి, 'ది ఇన్విసిబుల్ ఇండియన్' నివేదికను రూపొందించారు.

రిటైల్, ఆతిథ్యం, రవాణా లాంటి రంగాల్లో పనిచేస్తున్న భారతీయ అమెరికన్లపై కరోనా సంక్షోభం ప్రభావం తీవ్రంగా పడింది. 'ఈ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ అమెరికన్లలో మూడింట ఒక వంతు మందికి అమెరికా పౌరసత్వం లేదు. ప్రభుత్వం అందించే ప్రయోజనాలు వీరికి వర్తించవు'' అని ప్రొఫెసర్ కపూర్ చెప్పారు. కొద్ది రోజులుగా ముఖ్యంగా కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి అమెరికా ప్రభుత్వం తమ దేశ ఉద్యోగుల పరిస్థితి గురించే ఫోకస్ పెట్టింది. మిగతా దేశాల ఉద్యోగుల గురించి పట్టించు కోవడం లేదు. పైగా ఇతర దేశీయ ఉద్యోగులపై ఆంక్షలు కూడా విధిస్తోంది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయుల పరిస్థితిని ఆ దేశం పట్టించుకోవాలని, వారిని ఆదుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.