Begin typing your search above and press return to search.

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయులు: కారణం ఇదే..

By:  Tupaki Desk   |   9 July 2022 7:30 AM GMT
అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయులు: కారణం ఇదే..
X
అమెరికాలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ప్రవాస భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే భారతీయులు చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉన్నవారికి జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్క్ పర్మిట్లపై పనిచేవారి బాధ వర్ణనాతీతం. ఇప్పుడున్న వీసాలను రెన్యూవల్ చేసుకునే విధానంలో లోపాలు ఉండడం.. కొత్త వీసాల జారీలో జాప్యం కారణంగా ఎన్నారైలు అవస్థలు పడుతున్నారు. దీంతో వీసాలు లేకపోవడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉద్యోగం కోసం వచ్చిన వారికి అవకాశం రావడం లేదు. దీంతో ఇక్కడున్న భారతీయుల ఆదాయం సగానికి సగం పడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికాలో ప్రస్తతుం ఉద్యోగం చేయాలంటే ఇప్పుడున్న నిబంధనల ప్రకారం H-4 వీసాను కలిగి ఉండాలి. వీరితో పాటు H-4 EAD వీసాదారులు వాటిని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి రెన్యూవల్ కోసం సంబంధిత కార్యాలయాలకు భారతీయులు క్యూ కడుతున్నారు. వీసా రెన్యూవల్ కోసం బయోమెట్రిక్ సిస్టం ద్వారా అప్డేట్ చేసుకోవాలి.

కానీ కరోనా కారణంగా 2020లో ఈ కేంద్రాలను నాలుగు నెలలపాటు మూసివేశారు. ఆ తరువాత ఈ కేంద్రాలు తెరుచుకున్నా..సిబ్బంది పరిమిత సంఖ్యలోనే వస్తున్నారు. దీంతో వీసాల రెన్యూవల్ లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో సరైన సమయానికి వర్క్ పర్మిట్ రాకపోవడంతో చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు.

ఇక కొత్తగా ఉద్యోగం చేరేవారు సైతం ఇవే ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా వాటిని పెండింగులోనే ఉంచుతున్నారు. సాధారణంగా H-4 EAD కాలపరమితి దాటిన తరువాతే H-4 ను పొడగించుకునే అవకాశం ఉంటుంది.

కానీ కొత్తగా H-4 కోసం H-4 EAD కోసం దరఖాస్తు చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. దీంతో వారు ఏ క్షణాల్లో తమ ఉద్యోగాలు పోతాయోనని ఆందోళన చెందుతున్నారు. కొందరు మహిళలకు ప్రసూతి సెలవులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందడం కష్టతరంగా మారిందని అక్కడి వారు పేర్కొంటున్నారు.

కరోనా సంక్షోభం తరువాత అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఈ కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను పక్కనబెడుతున్నాయి. అయితే వర్క్ పర్మిట్లు ఉండి ప్రతిభ ఉన్నవారిని సంస్థలు వదలడం లేదు. ఈ సమయంలో ప్రతిభ ఉన్నా వర్క్ పర్మిట్ లేకపోవడంతో తాము రోడ్డున పడుతున్నామని ఎన్నారైలు తమ సన్నిహితులతో చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఎన్నారైలు ఎదురుచూస్తున్నారు.