Begin typing your search above and press return to search.
గ్రీన్ కార్డులు కోసం ధర్నాకి దిగిన ఇండియన్స్
By: Tupaki Desk | 19 March 2021 8:41 AM GMTఅమెరికాలో స్థిర నివాసానికి గ్రీన్‌కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఇండో-అమెరికన్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది క్యాపిటల్ భవనం ముందు ధర్నాకి దిగారు. గ్రీన్ కార్డుల జారీలో దేశాల వారీ కోటాను ఎత్తివేయాలని డిమాండు చేశారు. కరోనా వైరస్ విజృంభణ సమయంలో రోగులకు విశేషమైన సేవలు అందిస్తున్నామని, మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నామని ఆందోళనలో పాల్గొన్న డాక్టర్ రాజ్ కర్ణాటక్, డాక్టర్ ప్రణవ్ సింగ్‌లు చెప్పారు. తాము అమెరికాలోనే శిక్షణ పొంది, ఇక్కడే పనిచేస్తున్నామని తెలిపారు. గ్రీన్ కార్డులు ఇవ్వకపోవడంతో వేరే చోటుకి, వేరే ఉద్యోగానికి మారలేకపోతున్నామని అన్నారు. అలాగే గ్రీన్ కార్డుల్లో దేశాల వారి కోటా ను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
కరోనా విపత్తు నేపథ్యంలో గ్రీన్ కార్డులపై ట్రంప్ విధించిన బ్యాన్ ను అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఇప్పటికే రద్దు చేశారు. అమెరికాకు వచ్చే ఇమిగ్రెంట్లకు పర్మనెంట్ రెసిడెన్సీ కోసం గ్రీన్ కార్డులు(పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్స్) జారీ చేస్తుంటారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత అమెరికన్ వర్కర్లకు అవకాశాలు తగ్గిపోరాదన్న ఉద్దేశ్యంతో అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ దేశంలోకి గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్ రాకను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను బైడెన్ గత నెల చివర్లో రద్దు చేశారు. తాజా నిర్ణయంతో వేలాది మంది ఇండియన్లకు ప్రధానంగా హెచ్1బీ వీసాలపై అమెరికా వెళ్లే ఇండియన్ టెకీలకు ప్రయోజనం కలగనుంది.