Begin typing your search above and press return to search.

అమెరికా రోడ్ల‌పై మ‌నోళ్ల ర్యాలీ

By:  Tupaki Desk   |   20 March 2018 12:50 PM GMT
అమెరికా రోడ్ల‌పై మ‌నోళ్ల ర్యాలీ
X
అమెరికా వీధుల్లో భార‌తీయులు పోటెత్తారు. ఎప్పుడూ లేని రీతిలో సోమ‌వారం అమెరికా వ్యాప్తంగా భార‌తీయ ఉద్యోగులు.. నిపుణులు ర్యాలీలు నిర్వ‌హించారు. అమెరికాలోని ప‌లు రాష్ట్రాల్లో ఇలాంటి సీన్ చోటు చేసుకుంది. ఎందుకిలా ఉంటే.. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాలే కార‌ణంగా చెబుతున్నారు.

అమెరికా పౌర‌సత్వ‌మైన గ్రీన్ కార్డు జారీకి భారీ జాప్యం జ‌ర‌గ‌టం.. దేశాల వారీగా ఉన్న ప‌రిమితిని ఎత్తేయాల‌ని కోరుతూ వారు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. అమెరికాలోని ప‌లువురు భార‌తీయులు అమెరికా పౌర‌స‌త్వం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ ఎన్నిక‌య్యాక గ్రీన్ కార్డుల జారీ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌టంతో అమెరికా పౌర‌స‌త్వం మీద ఆశ‌లు పెట్టుకున్న వారంతా తీవ్ర నిరాశ‌కు గురి అవుతున్నారు.

అమెరికాకు హెచ్ 1బీ వీసాల‌పై వెళ్లిన వారు గ్రీన్ కార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి న‌ష్టం క‌లుగుతోంద‌ని.. ఏళ్ల త‌ర‌బ‌డి గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూడాల్సి వ‌స్తోంద‌ని వాపోతున్నారు. దేశాల వారీగా కోటాను ఎత్తేయాలంటూ భార‌తీయులు ప‌లువురు త‌మ ప్రాంతాల్లోని శాస‌న‌క‌ర్త‌ల మ‌ద్ద‌తు కోరుతూ ర్యాలీలు నిర్వ‌హించారు.

భార‌తీయులు ఎక్కువ‌గా ఉండే అర్కాన్సాన్.. కెంటుస్కీ.. ఓరెగావ్ ప్రాంతాల్లో నిర‌స‌న‌లు పెద్ద ఎత్తున నిర్వ‌హించారు. అమెరికా అధ్య‌క్షుడిగా లిండ‌న్స్ జాన్స‌న్ ఉన్న వేళ పెట్టిన నిబంధ‌న ఈ కాలానికి ఏ మాత్రం స‌రిపోద‌న్న అభిప్రాయాన్ని వారు వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం భార‌తీయులు రోడ్ల మీద‌కు వ‌చ్చి చేప‌ట్టిన ర్యాలీ ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.