Begin typing your search above and press return to search.

పేలిన తూటాతో.. మారుతున్న డాలర్ డ్రీమ్స్

By:  Tupaki Desk   |   26 Feb 2017 7:56 AM GMT
పేలిన తూటాతో..  మారుతున్న డాలర్ డ్రీమ్స్
X
గన్ కల్చర్ విపరీతంగా ఉంటే.. అమెరికాలో తూటాలు పేలటం.. ప్రాణాలు పోవటం మామూలే. కానీ.. కాన్సస్ లో తెలుగోడు కూఛిబొట్ల శ్రీనివాస్ మీద పేలిన తూటా కాస్త భిన్నమైంది. దాని వెనుక విద్వేషం ఉంది. జాత్యాంహకారం ఉంది. మూలాల్ని మర్చిపోతున్న కొందరి అమెరికన్ల మైండ్ సెట్ మూర్ఖంగా మారుతున్న వైనం ఇప్పుడు ఇండియాలోని యూత్ ఆలోచనల్ని మార్చేస్తున్నాయి. వారి డాలర్ డ్రీమ్స్ ను ప్రశ్నలతో నింపేస్తూ.. మరో దిశలో ఆలోచించే తీరుకు శ్రీకారం చుడుతున్నారు.

వాస్తవానికి శ్రీనివాస్ మీద పేలిన తూటాతోనే ఇదంతా జరుగుతుందంటే అతిశయోక్తే అవుతుంది. కాకుంటే.. ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పెరిగిన సందేహాలకు శ్రీనివాస్ మీద పేలిన తూటా స్పష్టమైన సందేశాన్ని ఇవ్వటమే కాదు.. ఫ్యూచర్ ను ఎలా డిజైన్ చేసుకోవాలన్న అంశంపై సరికొత్త ఆలోచనల్ని పుట్టేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

ఉన్నత చదువుల్ని అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన అమెరికా విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్ చేయాలనుకునే కలల్ని లక్షలాదిమంది విద్యార్థులు కంటుంటారు. అయితే.. దాన్ని సాకారం చేసుకునే వారు కొద్దిమంది మాత్రమే. ట్రంప్ పవర్ లోకి వచ్చిన తర్వాత.. అమెరికాలో ఉన్నత చదువుల మీద కొన్ని సందేహాలు వ్యక్తమైనప్పటికీ.. అవన్నీ వాటికవే సర్దుకుంటాయన్న భావన నెలకొంది. దీంతో.. ఎవరికి వారు తమ ఫ్యూచర్ ప్లాన్లను సిద్ధం చేసుకున్నారు.

అయితే.. అనూహ్యంగా ఇరవైరోజుల వ్యవధిలో రెండు ఘటలు చోటు చేసుకోవటం.. తెలుగోళ్ల ప్రాణాలు పోవటంతో కలకలం రేగింది. ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా సమాజంలో విద్వేష పోకడలు పెరగటం.. వలసవాదులపై దాడులు జరగటం ఎక్కువైంది. దీంతో.. అమెరికా భారతీయులకు ఏమాత్రం క్షేమకరం కాదన్న భావన అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని అమెరికాకు పంపే విషయంలో కొత్త సందేహాలు వ్యక్తం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఇదే సమయంలో గడిచిన రెండు వారాల వ్యవధిలో అమెరికాకు ప్రత్యామ్నాయంగా బ్రిటన్.. ఆస్ట్రేలియా.. కెనడా విశ్వవిద్యాలయాల సమాచారాన్ని సేకరించటం.. కన్సల్టెటెంట్లను సంప్రదిస్తున్న ధోరణి పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు ఇంత జరుగుతున్నా.. ట్రంప్ సర్కారు స్పందన అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో.. డాలర్ డ్రీమ్స్ మీద కొత్త భయాందోళనలు వ్యక్తం కావటమే కాదు.. అమెరికాకు ప్రత్యామ్నాయంగా దేన్నిఎంపిక చేసుకోవాలన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/