Begin typing your search above and press return to search.
గ్రీన్ కార్డ్..ఓ జీవితకాలం లేటు
By: Tupaki Desk | 16 Jun 2018 11:14 AM GMTఅమెరికాలోని భారతీయ నిపుణులకు ఊహించని షాక్ వంటి వార్త ఇది. అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డు)ను పొందేందుకు ఎదురుచూస్తున్న వృత్తినిపుణులకు నిరీక్షణ జాబితాతో షాక్ తగిలింది. అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం చాలా మంది ఎన్ఆర్ఐలు ఎదురుచూస్తుంటడంపై వాషింగ్టన్కు చెందిన క్యాటో ఇన్స్టిట్యూట్ దీనిపై తాజాగా ఓ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. దాని ప్రకారం కొందరు భారతీయులకు గ్రీన్ కార్డు రావాలంటే కనీసం 151 ఏళ్లు పడుతుందట. గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారి జాబితాను అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ రిలీజ్ చేసింది. సుమారు 6 లక్షల 32 వేల మంది భారతీయులు అమెరికా గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈబీ1 క్యాటగిరీలో 34వేల 824 మంది అప్లికేషన్ చేసుకున్నారు.సుమారు 4 లక్షలకు పైగా భారతీయ ఉద్యోగులు గ్రీన్ కార్డు కోసం నిరీక్షించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత వృత్తినిపుణులుగా ఖ్యాతిపొందుతున్న భారతీయులు ప్రధానంగా హెచ్-1బీ వర్క్ వీసాలతో అమెరికాకు వస్తున్నారు. అమెరికాలో గత నెలాఖరు నాటికి ఉపాధి ఆధారిత ప్రాధాన్య క్యాటగిరీలో మొత్తం 3,95,025 మంది విదేశీయులు గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని, వీరిలో భారతీయులే 3,06,601 మంది ఉన్నారని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ తర్వాత చైనా 67,031 మందితో ద్వితీయ స్థానంలో ఉంది. ఇక మిగిలిన ఏ దేశానికి చెందిన వారు కూడా 10 వేల మందికి మించి లేరని యూఎస్సీఐఎస్ వివరించింది. అమెరికాలో ప్రస్తుతమున్న చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో జారీచేసే మొత్తం గ్రీన్‌కార్డుల్లో ఏ దేశానికి చెందిన వారికైనా 7 శాతం కంటే ఎక్కువ మంజూరు చేయడానికి వీల్లేదు. దీని వలన భారతీయులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రీన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. అయితే 7 శాతం పరిమితి నిబంధన వలన అమెరికాలో శాశ్వత నివాస హోదాను పొందేందుకు భారతీయులు సుదీర్ఘ కాలం పాటు (25 నుంచి 92 ఏళ్ల వరకూ) నిరీక్షించాల్సి వస్తోందని కొద్దికాలం కిందట వెలువడిన ఓ నివేదికలో తేలింది.
కాగా, ఒక దేశానికి ఏడు శాతం గ్రీన్ కార్డులు మాత్రమే జారీ చేయాలనే నిబంధన వల్ల భారతీయులు శాశ్వత నివాసం కోసం కొన్నేళ్ల పాటు ఎదురుచూడాల్సి వస్తుందనీ... ఈ పరిస్థితిలో మార్పు రావాల్సి ఉందని యూఎస్‌కు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రీన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న విధానంలో మార్పులు చేయాల్సిందిగా కోరుతూ పలువురు భారతీయులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు.