Begin typing your search above and press return to search.

యాంటీ రేడియేష‌న్ మిసైల్ ... రుద్రం ప్రయోగం విజయవంతం !

By:  Tupaki Desk   |   9 Oct 2020 4:00 PM GMT
యాంటీ రేడియేష‌న్ మిసైల్ ... రుద్రం ప్రయోగం విజయవంతం !
X
దేశ రక్షణ రంగం రోజురోజుకి బలోపేత మవుతోంది. తాజాగా శత్రు దేశాల రాడార్లను మట్టి కరిపించే మిసైల్ ‌ను విజయవంతంగా పరీక్షించింది. దీనిని సుఖోయ్‌...30 యుద్ధ విమానం నుంచి ఈ మిస్సైల్‌ ను ప్రయోగించవచ్చు. ఇది శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బ తీయగలదు. ఇది శబ్ద వేగం కన్నా రెట్టింపు వేగంతో దూసుకెళ్ళగలదు. ఈ యాంటీ రేడియేషన్‌ మిసైల్‌ రుద్రం ని డీఆర్ ‌డీవో ఈ రోజు ఉదయం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌ నుంచి దీనిని ప్రయోగించారు.

భారత వాయు సేన సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించగలిగే ఈ మిసైల్ శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదు. ఈ మిసైల్‌ తో శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థను దెబ్బతీయగలిగే కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం వాయు సేనకు లభించింది. భారత వాయు సేన నిరాటంకంగా, సమర్థవంతంగా తన కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలవుతుంది. యుద్ధ విమానం ప్రయాణించే ఎత్తునుబట్టి ఈ మిసైల్ పరిథి ఆధారపడి ఉంటుంది.

కనిష్టంగా 500 మీటర్ల ఎత్తు నుంచి, గరిష్ఠంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి దీనిని ప్రయోగించవచ్చు. 250 కిలోమీటర్ల పరిధిలో రేడియేషన్‌ను వెలువరించే లక్ష్యాన్ని ఛేదించవచ్చు. రుద్రం క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై సైంటిస్టులు హర్షం వ్యక్తం చేశారు. రుద్రం భారత దేశపు మొదటి యాంటీ రేడియేషన్ మిసైల్ కావడం విశేషం.