Begin typing your search above and press return to search.
ఇప్పుడు మిస్టర్ వరల్డ్ కూడా మనోడే
By: Tupaki Desk | 2 Dec 2015 5:48 PM GMTఅందాల పోటీల్లో భారతీయుల హవా కొద్దికాలం నడిచింది. మిస్ వరల్డ్.. మిస్ యూనివర్స్ లాంటి టైటిళ్లను పలుమార్లు గెలుచుకున్న ఘన చరిత్ర భారత్ సొంతం. భారత్ అన్న వెంటనే అందాల భామలు చాలామందే గుర్తుకు వస్తుంటారు. ఐశ్వర్యారాయ్.. సుస్మితా సేన్.. ప్రియాంకా చోప్రా.. దియా మీర్జా.. డయానా హెడన్ లాంటి ఎందరో సౌందర్యరాసులు తమ అందంతో.. తమ తెలివితేటలతో మిస్ యూనివర్స్.. మిస్ వరల్డ్ టైటిళ్లను గెలుచుకొని ప్రపంచ వేదికల మీద భారత సత్తా చాటారు.
మిస్సుల విషయంలో తామేంటో భారత్ ఇప్పటికే నిరూపించుకుంటే. తాజాగా మిస్టర్ వరల్డ్ టైటిల్ ను సొంతం చేసుకున్ారు ఠాకూర్ అనూప్ సింగ్. థాయ్ లాండ్ లో జరిగిన మిస్టర్ వరల్డ్ పోటీల్లో 43 దేశాల నుంచి 70 మందితో పోటీపడి చివరకు ప్రతిష్ఠాత్మక మిస్టర్ వరల్డ్ టైటిల్ ను సొంతం చేసుకొని భారత్ కు సరికొత్త ఇమేజ్ ను తెచ్చి పెట్టారు.
పైలెట్ గా కెరీర్ షురూ చేసినా.. మహాభారత్ సీరియల్ లో దృతరాష్ట్రుడిగా సుపరిచితుడైన అనూప్.. తాజా టైటిల్ తో మరో ఘనత సాధించాడు. 1952 తర్వాత మిస్టర్ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకున్న వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఫైనల్ లో పోటీల్లో కండల తిరిగిన ఇద్దరు థాయ్ బాడీబిల్డర్ తో ఢీ కొని.. తన సత్తా చాటి..భారత కీర్తి పతాకాన్ని ఘనంగా ఎగురవేశాడు. కంగ్రాట్స్ మిస్టర్ వరల్డ్.