Begin typing your search above and press return to search.

వైజాగ్ కు సర్వీసులు బంద్ చేసిన ఇండిగో, ఎయిర్ ఏషియా

By:  Tupaki Desk   |   20 Feb 2020 9:30 PM GMT
వైజాగ్ కు సర్వీసులు బంద్ చేసిన ఇండిగో, ఎయిర్ ఏషియా
X
ఏపీ రాజధానిగా సీఎం జగన్ విశాఖను చేయడానికి దాదాపు మార్గం సుగమం అవుతోంది. పరిపాలన రాజధానిగా విశాఖను చేసి అక్కడి నుంచే పాలన సాగించడానికి జగన్ రెడి అయ్యారు. ఏపీ ప్రభుత్వం ఓ వైపు విశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సౌకర్యాలు కల్పిస్తుంటే తాజాగా ఈ తీరప్రాంత రాజధానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది..

తాజాగా విశాఖకు విమాన సర్వీసులు నిలిపివేయాలని ఇండిగో , ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు నిర్ణయించాయి. చెన్నై-వైజాగ్, హైదరాబాద్-వైజాగ్ మధ్య విమానాలను నడుపుతున్న ఇండిగో ఈ సేవలను మార్చి 2వ వారం నుంచి నిలిపివేయాలని నిర్ణయించింది.

ఇక ఎయిర్ ఏషియా సైతం కోల్ కతా-వైజాగ్ మధ్య విమానాలు నడిపిస్తోంది. ఈ సేవలను తాజాగా ఉపసంహరించుకుంది.

అయితే నిర్వహణ భారంతో ఈ రెండు సంస్థలు వైదొలగాయి. ఇదే సమయంలో పలు దేశీయ విమానయాన సంస్థలు వైజాగ్ నుంచి బెంగళూరు, వైజాగ్ నుంచి హైదరాబాద్ విమానాలు నడిపేందుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవడం ఊరటనిచ్చింది.

ఎయిర్ ఏషియా విశాఖ-కోల్ కతా విమాన సర్వీసుల రద్దు చేయాలని కోరిన అభ్యర్థన కు ఎయిర్ పోర్టు ఆథార్టీ ఆఫ్ ఇండియా ఇంకా అనుమతి ఇవ్వలేదని తెలిసింది. ఇక స్పైస్ జెట్ కూడా విశాఖ-ఢిల్లీ విమాన సేవలను వారం రోజుల పాటు నిలిపివేసింది. ఏపీలోని అతిపెద్ద నగరం విశాఖ.. వ్యాపార, పారిశ్రామిక పరంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతీ సంవత్సరం విమాన ప్రయాణికులు పెరుగుతున్నందున విమాన సంస్థలు వైదొలగడం విమానయానరంగానికి తీవ్ర దెబ్బగా పరిగణించింది.