Begin typing your search above and press return to search.

ఇండిగో ఆఫ‌ర్‌: వైర‌స్‌కు భ‌య‌ప‌డితే ప‌క్క‌ సీటు బుక్ చేసుకోవ‌చ్చు

By:  Tupaki Desk   |   17 July 2020 3:30 PM GMT
ఇండిగో ఆఫ‌ర్‌: వైర‌స్‌కు భ‌య‌ప‌డితే ప‌క్క‌ సీటు బుక్ చేసుకోవ‌చ్చు
X
వైర‌స్ వ్యాప్తి నేపథ్యంలో అంత‌ర్జాతీయ రాక‌పోక‌లు నిషేధం ఉన్న విష‌యం తెలిసిందే. దాదాపు నాలుగు నెలలుగా అంత‌ర్జాతీయ విమాన సేవ‌లు నిలిచిపోయాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా అన్‌లాక్ కావ‌డంతో ఇప్పుడు ఇత‌ర దేశాల‌కు విమాన సేవ‌లు మొద‌ల‌య్యాయి. చాలా దేశాల్లో ఈ సేవ‌లు ప్రారంభం కాగా భార‌త‌దేశంలో గురువారం నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. ఇప్పుడిప్పుడే విమాన‌యానం ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఈ స‌మంయ‌లో భార‌త్ అంత‌ర్జాతీయ విమాన సేవ‌ల‌కు ప‌చ్చ‌జెండా ఊప‌డంతో విమాన సర్వీసులు కూడా పునఃప్రారంభం కానున్నాయి. అయితే విమాన‌యానం ద్వారా వైర‌స్ ప్ర‌బ‌లే అవ‌కాశం చాలా ఎక్కువ‌గా ఉంది. ఇత‌ర దేశాల నుంచి ప్ర‌యాణికుల రాక మొద‌లైతే ప‌రిస్థితి చేయి దాటే అవ‌కాశం ఉంది. అందుకే పౌర విమానయాన శాఖ కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. వాటికి అనుగుణంగా సేవ‌లు కొన‌సాగాల‌ని ఆ శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ ప్రకటించాడు. ఈ మేర‌కు విమాన సంస్థ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇండిగో సంస్థ స‌రికొత్త ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. వైర‌స్‌ భయంతో విమాన ప్రయాణానికి జంకుతున్న వారి కోసం ఇండిగో సంస్థ కొత్త సౌకర్యం క‌ల్పించింది.

వైరస్ సోక‌కుండా మాస్క్‌ ధరించడం.. శానిటైజ‌ర్ వినియోగంతో పాటు భౌతిక దూరం త‌ప్ప‌నిస‌రి. వీటిని తూచ పాటిస్తే వైర‌స్ మ‌న ద‌రి చేర‌కుండా ఉంటుంది. ఈ క్ర‌మంలో విమానంలో కూడా ఇదే విధానం పాటించేలా విమాన‌యాన సంస్థ‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ఇండిగో సంస్థ విమాన ప్రయాణంలోనూ భౌతిక దూరం కోసం ప్రయాణికులు కావాలంటే 2 సీట్లు బుక్‌ చేసుకునేలా ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఈ డబుల్‌ సీట్ స్కీంను ఈ నెల 24వ తేదీన ప్రారంభించనుంది. అదనపు సీటు బుక్‌ చేసుకునే వారు వాస్తవ టికెట్‌ ధర కంటే 25 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో తెలిపింది. ప్రయాణికుడు బుక్‌ చేసుకున్న సీటు పక్కనే రెండోది కూడా ఉంటుంది. దీంతో ప్ర‌యాణికుడు కొంత భ‌రోసాగా విమాన ప్ర‌యాణం చేయ‌వ‌చ్చ‌ని ఇండిగో వివ‌రించింది.
Tags: