Begin typing your search above and press return to search.

మళ్లీ ఎగురుతామా? పైలెట్ల వీడియో వైరల్

By:  Tupaki Desk   |   10 April 2020 8:30 PM GMT
మళ్లీ ఎగురుతామా? పైలెట్ల వీడియో వైరల్
X
కరోనా కల్లోలానికి జనాలే కాదు.. పరిశ్రమలు, సంస్థలు మూతపడి తెరుచుకోవడం లేదు. అన్నిటికంటే అతి ఎక్కువగా నష్టపోయింది విమానయాన రంగమే.. విదేశాల నుంచి విమానాల ద్వారా వచ్చిన వారికే కరోనా సోకడంతో ఇప్పుడిప్పుడే విమానయాన పరిశ్రమ పునరుద్ధరించబడే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో దీన్ని నమ్ముకొని ఉన్న పైలెట్లు, సిబ్బందిలో బతుకు భయం నెలకొంది. తమను ఉద్యోగాల్లో ఉంచుతారా? తీసేస్తారా? అసలు విమానాలు మళ్లీ ఎగురుతాయా అన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఎప్పుడు విధుల్లో చేరాలన్న దానిపై కూడా స్పష్టత లేదు.

దీంతో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇండిగో పైలెట్ ప్రదీప్ కృష్ణన్.. ఇతర పైలెట్లతో కలిసి ఒక వీడియో రూపొందించారు. అదిప్పుడు వైరల్ గా మారింది. విమానాలు మళ్లీ ఎగురుతాయని పైలెట్లలో విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి ఈ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కొంత సహనం అవసరమని అన్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో విమానాలు ఇప్పుడప్పుడే ఎగిరే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన సంస్థలు సుమారు 5 కోట్ల మంది ప్రయాణికులను కోల్పోతున్నారు. 2019లో ఏకంగా 14 కోట్ల మంది ప్రయాణించారు. ఈసారి విమానయానంలో నష్టాలు తప్పేలా లేవు. ఎంతమంది ఉద్యోగాలు పోతాయో చెప్పలేని పరిస్థితి. అందుకే వారిలో స్ఫూర్తినింపేలా పైలెట్ ప్రదీప్ కృష్ణన్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.