Begin typing your search above and press return to search.

ఇందిరమ్మ ఆ డాన్ ను తరచూ కలిసేవారట...!

By:  Tupaki Desk   |   16 Jan 2020 8:15 AM GMT
ఇందిరమ్మ ఆ డాన్ ను తరచూ కలిసేవారట...!
X
సీనియర్ రాజకీయనేతల మాటలు ఎంత సంచలనంగా మారతాయనటానికి నిదర్శనంగా శివసేన రాజ్యసభ సభ్యుడు తాజాగా చేసిన వ్యాఖ్యలుగా చెప్పాలి. ముంబయిని వణికించిన అండర్ వరల్డ్ డాన్ కరీం లాలాను దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తరచూ కలిసేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమానికి హాజరైన రౌత్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ గురించి ఊహించని రీతిలో మాట్లాడారు.

అప్పట్లో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇందిరమ్మ.. రాజీవ్ లంటే తనకెంతో గౌరవ మర్యాదలు ఉన్నాయని చెప్పారు. ఇందిరపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ తాను ఆమెకు మద్దుతుగా మాట్లాడేవాడినని పేర్కొన్నారు. అండర్ వరల్డ్ ప్రభావం రాజకీయాల్లో ఎంత ఉందన్న విషయాన్ని పేర్కొంటూ.. జరిగిపోయిన అంశాలుగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

ఇందిరమ్మ ముంబయికి వచ్చిన ప్రతిసారీ నాటి అండర్ వరల్డ్ డాన్ కరీం లాలాను కలిసేవారని చెప్పిన ఆయన.. అప్పట్లో ముంబయి పోలీసు కమిషనర్ గా ఎవరుండాలి? అసెంబ్లీలో ఎవరుండాలన్న విషయం మీద తాను చాలాసార్లు మాట్లాడిన వైనాన్ని పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడా విషయాలన్ని చాలా చిల్లరగా అనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ప్రత్యక్షంగా కలిసిన అతి కొద్దిమంది పొలిటిషియన్లలో తాను ఒకడంటూ ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.

దావూద్ తో తాను నేరుగా చాలా విషయాలు మాట్లాడేవాడినని చెప్పారు. అయితే.. అతడి నుంచి కొన్నిసార్లు హెచ్చరికలు కూడా ఎదుర్కొన్నట్లు చెప్పారు. దావూద్ తో తానొక ఫోటో సెషన్ లో కూడా పాల్గొన్నట్లు చెప్పారు. స్మగ్లింగ్.. గ్యాంబ్లింగ్ చట్ట విరుద్దమైన కార్యకలాపాలతో ముంబయిని రెండు దశాబ్దాలు ప్రభావితం చేసిన కరీం.. 2002లో తన తొంభై ఏళ్ల వయసులో మరిణించాడు. మరి.. రౌత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.