Begin typing your search above and press return to search.
అమెరికాలోని సూపర్ మార్కెట్లో విచక్షణరహితంగా కాల్పులు.. 10 మంది మృతి
By: Tupaki Desk | 23 March 2021 4:30 AM GMTఆగ్రరాజ్యంలో మరో దారుణ ఆరాచకం చోటు చేసుకుంది. ఒక ఉన్మాది కారణంగా పది మంది మృత్యువాత పడిన ఘోరం ఒకటి జరిగింది. ఇందుకు ఒక సూపర్ మార్కెట్ వేదికైంది. పేరుకు అగ్రరాజ్యమే తప్పించి.. అన్ని దరిద్రాలు.. ఛండాలాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆ దేశంలోని కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్ లో గుర్తు తెలియని వ్యక్తి సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి.. విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.ఈ ఉదంతంలో పది మంది మరణించారు.
కాల్పుల శబ్దాలతో భయాందోళనలకు గురైన మిగిలిన వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. వారం వ్యవధిలో అమెరికాలో ఈ తరహా ఘటన ఇది రెండోది. కొద్ది రోజుల క్రితమే మసాజ్ పార్లర్ లో విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న వైనం తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజాము ప్రాంతంలో) ఈ దారుణం చోటు చేసుకుంది.
కాల్పులకు పాల్పడిన వ్యక్తిగా అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి కారణాలు ఏమిటన్న దానిపై స్పష్టత రాలేదు. దాడి జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మొహరించారు. జరిగిన విషాదం పట్ల కొలరాడో గవర్నర్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. జరిగిన పరిణామాల్ని తాను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. వరుస కాల్పుల ఉదంతం అమెరికన్లను హడలెత్తిస్తోంది.