Begin typing your search above and press return to search.
టైమ్ ‘కిడ్ ఆఫ్ ది ఇయర్' గా గీతాంజలి రావు... ఎవరు ?
By: Tupaki Desk | 4 Dec 2020 10:56 AM GMTప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ తొలిసారిగా ప్రవేశపెట్టిన కిడ్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో ఇండో-అమెరికన్ బాలిక గీతాంజలి రావు సత్తా చాటారు. పోటీలో ఉన్న 5 వేల మందితో పోటీ పడి, ఈ పురస్కారానికి ఆమె ఎంపికయ్యారు. ఈ మేరకు టైమ్ మ్యాగజైన్ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. 15 ఏళ్ల బాలిక ఇండియన్ అమెరికన్ గీతాంజలి రావుకు ప్రతిష్ఠాత్మక టైమ్ మేగజైన్ నుంచి అరుదైన గుర్తింపు లభించింది.
కలుషితమైన నీటిని గుర్తించడం నుంచి మత్తు పదార్థాలకు బానిసవుతున్న వారిని రక్షించడం, సైబర్ బెదిరింపులు వంటి పలు అంశాలకు సాంకేతికత సాయంతో గీతాంజలి పరిష్కార మార్గాన్ని చూపారని టైమ్ ప్రతినిధులు తెలిపారు. కరోనా సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘన, సైబర్ బెదిరింపులు, పర్యావరణ మార్పులు ఇలా ప్రస్తుతం తన తరంవారు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని గీతాంజలి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వీటికి సమర్థవంతమైన పరిష్కారాన్ని చూపాలన్నారు.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే గీతాంజలిని ప్రముఖ హాలీవుడ్ నటి..యాక్షన్ సినిమాల్లో హీరోకు ఏమాత్రం తగ్గని రేంజ్ లో ఫీట్లు..ఫైట్లు చేసే ఏంజెలినా జోలి వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఏంజెలినా జోలీ అడిగిన ఓ ప్రశ్నకు గీతాంజలి చేసే పరిశోధనల గురించి అడుగగా..గమనించడం, ఆలోచించడం, పరిశోధించడం, ఫలితం సాధించడం, సమాచారం ఇవ్వడం తన ప్రయోగమని చాలా క్లియర్ గా సమాధానం చెప్పింది. ఆమె సమాధానానికి ఏంజెలినా చాలా ముగ్ధురాలైంది.