Begin typing your search above and press return to search.

సందిగ్దంలో ఇండో అమెరికన్స్!

By:  Tupaki Desk   |   25 Oct 2016 5:45 AM GMT
సందిగ్దంలో ఇండో అమెరికన్స్!
X
ప్రస్తుతం చాలా మంది అమెరికన్స్ తో పాటు ఇండియన్-అమెరికన్స్ కి కూడా అతిపెద్ద సమస్య వచ్చి పడింది. అదే... త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలా అని. ఈ విషయంలో ఇప్పటికే అమెరికాలో చాలా మంది విపరీతమైన స్ట్రెస్ కి లోనవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి కూడా. ఈ క్రమంలో ఒకవైపు ట్రంప్ తీసుకునే కొన్ని నిర్ణయాలు అభినందనీయంగా ఉంటున్నాయని, అలాగే హిల్లరీ కూడా కొన్ని చెడు నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు. కానీ... ట్రంప్ పై మహిళాలోకం యాంటీగా ఉన్నారనేది తెలిసిన విషయంఏ!

ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే అంశంపై క్లేవ్‌ లాండ్‌ లో నివసిస్తున్న ఇండో అమెరికన్లు డైలమాలో ఉన్నారట. వారిలో చాలా మంది మాత్రం హిల్లరీ క్లింటన్‌కే ఓటేస్తామని... మహిళలు - వలసల అంశంపై డొనాల్డ్ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొంటున్నారట. కానీ ఈ ట్రంప్ విషయంలో కూడా కొంతమంది సానుకూలత వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలోనూ, ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలోనూ ట్రంప్‌ విజన్‌ వారి హృదయాలను తాకుతుందని చెబుతున్నారు. ఇదే క్రమంలో హిల్లరీ క్లింటన్‌ కు కూడా వ్యతిరేకత వస్తూనే ఉంది. హిల్లరీకి ఓటేసి మరోమారు ఒబామా తరహా పాలన కావాలని వారు భావించడంలేదట. ఇలా భావించేవారు పోని ట్రంప్‌ వైపు మొగ్గుచూపుతున్నారా అంటే... అతని తాజా వివాదాలు వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయట. దీంతో ఎవరికి ఓటు వేయాలనే విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారట వీరంతా!

ఈ నేపథ్యంలో హిల్లరీకి పై ఉన్న నమ్మకం - అభిమానం సంగతి కాసేపు పక్కనపెడితే ట్రంప్‌ కు వ్యతిరేకంగానే ఆమెకు ఓటేయాలని అనుకుంటున్నారట. మరోవైపు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తీసుకునే నిర్ణయాలను ఇకపై భరించే స్థితిలో లేరని ప్రముఖ న్యాయవాది - ‘ఇండియన్‌–అమెరికన్స్‌ ఫర్‌ ట్రంప్‌–2016’ ఉపాధ్యక్షుడు ఆనంద్‌ అహూజా చెబుతున్నారు. దీంతో ఎన్నికల సమయానికి ఫలితాలు నేడు సర్వేలు చెబుతున్నట్లే ఉంటాయా లేక ఇండో-అమెరికన్స్ మనసు మారుతుందా అనేది వేచి చూడాలి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/