Begin typing your search above and press return to search.
కెనడా హౌస్ లీడర్ గా భారత నారి!
By: Tupaki Desk | 22 Aug 2016 6:29 AM GMTకెనడాలో భారతీయ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. హౌస్ ఆఫ్ కామన్స్ లో నాయకురాలుగా ఇండో-అమెరికన్ మహిళ బద్రిష్ చగ్గర్ ని ప్రభుత్వం నియమించింది. ఈ పదవిని అలంకరించిన తొలి మహిళ కూడా బద్రిష్ కావడం విశేషం. ఈమె 2015లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. వాటర్లూ జిల్లా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయి క్యాబినెట్లో మంత్రి పదవి కూడా పొందారు. స్మాల్ బిజినెస్ అండ్ టూరిజం శాఖ బాధ్యతలు నిర్వహించారు. కెనాడాలోని భారతీయ సంతతికి చెందిన 19 మంది ఎంపీలలో ఆమె కూడా ఒకరు. డొమినిక్ లెబ్లాంక్ స్థానంలో చగ్గర్ ను దిగవ సభకు నాయకురాలిగా ప్రకటిస్తూ కెనడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని తాజాగా ప్రకటించింది. దీంతో చగ్గర్ కు అరుదైన గౌరవం లభించిందని చెప్పాలి.
బద్రిష్ చగ్గర్ కుటుంబం భారతదేశం నుంచి 1970లలోనే వాటర్లూకు వెళ్లారు. చగ్గర్ తండ్రి గుర్మిందర్ కూడా అక్కడ రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉండేవారు. లేబర్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. చగ్గర్ కి చిన్నప్పటి నుంచీ నర్స్ కావాలనే కోరిక ఉండేదట. నర్స్ కోర్స్ చేసి సమాజ సేవ చేయాలని కలలు కంటూ ఉండేవారట. ఆ ఉద్దేశంతోనే యూనివర్శిటీ ఆఫ్ వాటర్లూలో చదువుకున్నారు. అయితే, తరువాత కెనడీయన్ రాజకీయ నాయకుడు ఆండ్రూ తెలగ్డీకి కార్యనిర్వహాక సహాయకురాలిగా పని చేశారు. సైన్స్‌లో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత, 2008 నుంచి తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ చేసుకున్నారు. కిచనీర్ వాటర్లూ మల్లీసెంటర్‌కు స్పెషల్ ఈవెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరువాత, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. వాటర్లూ జిల్లా ఎంపీగా ఎన్నికయ్యారు. సో... ఇప్పుడు ఏకంగా పార్టీ తరఫున దిగువ సభలో నాయకత్వ బాధ్యతలు అందుకున్నారు. ఈ గౌరవం బద్రిష్ కు దక్కినందుకు భారతీయులు గర్వించదగ్గ విషయం.