Begin typing your search above and press return to search.

మళ్లీ సునామీ భయం.. భయం గుప్పిట్లో ప్రజలు

By:  Tupaki Desk   |   27 Dec 2018 7:23 AM GMT
మళ్లీ సునామీ భయం.. భయం గుప్పిట్లో ప్రజలు
X
సునామీ భయం గురువారం ఉదయం మరోసారి వెంటాడింది. ఇండోనేషియా దేశానికి సమీపంలో మొన్న సునామీకి కారణమైన క్రకటోవా అగ్ని పర్వతం మరోసారి లావా- బూడిద- పొగలు వెదజల్లుతోంది. దీంతో ఇండోనేషియాలో హై అలర్ట్ ప్రకటించారు. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. జనవరి 4 వరకు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తీరం వైపు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవలే ఇండోనేషియాలో వచ్చిన సునామీ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 491కి చేరినట్టు ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. పశ్చిమ జావా ప్రాంతంలో ఎడతెరపి లేని వర్షానికి అక్కడ సహాయక చర్యలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. క్రకటోవా అగ్నిపర్వతం నుంచి వెదజల్లుతున్న బూడిద మేఘాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోస సమస్యలు వచ్చిపడుతున్నాయి. నునోయ్ ప్రాంతంతో ఇండోనేషియాకు సంబంధాలు తెగిపోయాయి. ఇక్కడికి హెలీక్యాప్టర్ల తో సామాన్లను పంపిస్తున్నారు. రెండు కిలోమీటర్ల పరిధిలో అగ్రిపర్వతం చురుకుగా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

తాజాగా క్రాకటోవా అగ్ని పర్వతం మరోసారి వెదజల్లుతుండడంతో దాని ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపారు. దీంతో ఇండోనేషియాతోపాటు పక్కనున్న దేశాలు, భారత్ కు కూడా హెచ్చరికలు పంపారు. తీర ప్రాంతం వెంట ఉన్న రాష్ట్రాలను భారత ప్రభుత్వం కూడా అలెర్ట్ చేసింది. చెన్నై- విశాఖ పట్నం కలెక్టర్ల ను కూడా ప్రభుత్వాలు అలెర్ట్ చేశాయి.