Begin typing your search above and press return to search.

చిన్నారి వెన్నెముకతో హ్యాండ్ బ్యాగ్..నెటిజన్స్ ఫైర్

By:  Tupaki Desk   |   21 April 2020 11:30 PM GMT
చిన్నారి వెన్నెముకతో హ్యాండ్ బ్యాగ్..నెటిజన్స్ ఫైర్
X
సృజనాత్మకత వేలం వెర్రిగా మారడమంటే ఇదేనేమో.. ప్రపంచానికి కొత్తది పరిచయం చేయాలన్న తొందరలో కొందరు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. మనుషుల కళేబరాలతో వస్తువులు తయారు చేసి అది ఫ్యాషన్ గా ప్రపంచానికి చూపిస్తున్నారు. కానీ దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.

తాజాగా ఇండోనేషియా డిజైనర్ అర్నాల్డ్ పుత్ర ఒక హ్యాండ్ బ్యాగ్ రూపొందించాడు. మనిషి వెన్నెముకను హ్యాండ్ బ్యాగ్ తయారీకి ఉపయోగించాడు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇదో ఫ్యాషన్ అంటూ గొప్పలకు పోయాడు. ఆ ఫొటో వైరల్ గా మారింది. ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకునే స్లింగ్ చిన్నారి వెన్నెముక అని తెలియడంతో నెటిజన్లు - స్థానికులు మండిపడుతున్నారు.

మనిషి వెన్నెముకతో హ్యాండ్ బ్యాగ్ తయారు చేసిన పుత్ర అనే డిజైనర్ దీన్ని సోషల్ మీడియాలో 2016లోనే షేర్ చేశాడు. అదిప్పుడు ట్విట్టర్ లో కొందరు షేర్ చేసి వైరల్ చేశారు. మొసలి నాలుక - మనిషి వెన్నెముకతో దీన్ని తయారు చేశానని పుత్ర తెలిపాడు. 5వేల డాలర్ల విలువైన ఈ బ్యాగ్ ఎముకల వ్యాధితో చనిపోయిన చిన్నారి వెన్నెముకతో తయారు చేశానని తెలిపాడు.

దీంతో పుత్రపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నీ అంత దుర్మార్గుడు లేడని.. ఘోరంగా మనిషి అస్తిపంజరంతో చేస్తావా అని కడిగిపారేస్తున్నారు. నీకసలు మానవత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.