Begin typing your search above and press return to search.

ఆడా..మ‌గా క‌లిసి భోజ‌నం చేయ‌కూడ‌దంటూ ఆర్డ‌ర్‌

By:  Tupaki Desk   |   6 Sep 2018 12:30 PM GMT
ఆడా..మ‌గా క‌లిసి భోజ‌నం చేయ‌కూడ‌దంటూ ఆర్డ‌ర్‌
X
చరిత్ర చ‌దువుకున్నోళ్ల‌కు తుగ్ల‌క్ పాల‌న గురించి బాగానే ఐడియా ఉంటుంది. చ‌రిత్ర చ‌దువుకోకున్నా.. చెత్త పాల‌న‌కు కేరాఫ్ అడ్ర‌స్ తుగ్ల‌క్ గా ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు. అలాంటి తుగ్ల‌క్ కు సైతం రాని చెత్త ఐడియా తాజాగా ఇండోనేషియాలోని ఒక జిల్లా అధికారుల‌కు వ‌చ్చింది.

ప్ర‌పంచంలోని చాలా దేశాలు తాము అమ‌లు చేస్తున్న ద‌రిద్రపు నిర్ణ‌యాల్ని ఒక్కొక్క‌టిగా ఎత్తేస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా ఎక్క‌డా లేని చెత్త నిర్ణ‌యాన్ని తాజాగా తీసుకొన్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇంత‌కీ అంత‌టి చెత్త నిర్ణ‌యం ఏమంటే.. ఇండోనేషియాలోని అసెహ్ ప్రాంతానికి చెందిన ఒక జిల్లాలో మ‌హిళ‌లు.. పురుషులు క‌లిసి భోజ‌నం చేయొద్ద‌ని నిషేధం విధించారు.

మ‌హిళ‌లు ఎవ‌రైనా స‌రే.. త‌న భ‌ర్త లేదంటే బంధువుల‌తో పాటు మాత్ర‌మే రెస్టారెంట్ల‌కు వెళ్లాలంటూ నిబంధ‌న‌ల్ని విధించారు. లంచ్.. డిన్న‌ర్.. ఏదైనా స‌రే త‌మ స‌హ ఉద్యోగుల‌తో సైతం భోజ‌నం చేయ‌కూడ‌ద‌ని.. కేవ‌లం భ‌ర్త‌ల‌తోనూ.. కుటుంబ స‌భ్యుల‌తోనూ మాత్ర‌మే రెస్టారెంట్ల‌కు వెళ్లాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

అంతే కాదు.. రాత్రి 9 గంట‌ల త‌ర్వాత ఒంట‌రిగా వ‌చ్చే మ‌హిళ‌ల‌కు రెస్టారెంట్లు.. కెఫెల‌లో ఎలాంటి సేవ‌లు అందించ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. చూస్తుంటే.. ఇండోనేషిలో క్ర‌మంగా ఆట‌విక‌పాల‌న దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లుగా క‌నిపించ‌ట్లేదు?