Begin typing your search above and press return to search.
పాడు రైలు వంద మందికి పైనే చంపేసింది
By: Tupaki Desk | 20 Nov 2016 11:57 AM GMTయూపీలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కాన్పూర్ దేహత్ జిల్లా పుఖ్రాయాన్ వద్ద ఈ రోజు తెల్లవారుజామున (ఆదివారం) మూడు గంటల ప్రాంతంలో పట్నా – ఇండోర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో తొలు పదిహేను మంది మరణించినట్లుగా భావించినా.. మధ్యాహ్నం వేళకు అది కాస్తా 100కు పైగా చేరుకోవటం దిగ్భాంత్రికి గురి చేస్తోంది. మరో 276 మంది గాయాల పాలు కాగా.. వారిలో 76 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు.
మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పిన ఈ దారుణ ఘటనలో ఘటనా స్థలం భీతావాహంగా మారింది. పెద్ద ఎత్తున మృతి చెందంటం.. తమ వాళ్లకోసం బంధువులు.. సన్నిహితుల వెదుకులాట.. రోదనలు.. అక్కడి వాతావరణం శోక సంద్రంగా మారింది. తండ్రిని కోల్పోయిన కుమార్తె.. తల్లిని కోల్పోయిన చిన్నారులు.. ఇలా ఎవరిని కదిలించినా ఏదో ఒక విషాదమే. ప్రమాదం తీవ్రత ఎంత ఎక్కవగా ఉందన్న విషయానికి వస్తే.. ఒక బోగీ మొత్తంగా నుజ్జునుజ్జు అయ్యింది. ఇందులో ప్రయాణికులు చిక్కుకోవటం మృతుల సంఖ్యను మరింత పెంచింది.
తాజా అంచనాల ప్రకారం.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన 76 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు మొదలైనప్పటికీ.. తెల్లవారుజామున ప్రమాదం జరగటంతో.. అధికార యంత్రాంగం స్పందించి.. ఘటనాస్థలానికి చేరుకోవటానికి కాస్త సమయం పట్టినా..చీకటి కారణంగా సహాయక చర్యలకు ఇబ్బంది కలిగినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుత్వ దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. ఘటన వివరాలు తెలుసుకున్న వెంటనే.. ఘటనాస్థలానికి మంత్రి వచ్చారు. మరో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసి.. మృతులకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు.. స్వల్ప గాయాలైనవారికి రూ.25వేల చొప్పున ఇచ్చారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కేంద్రం రూ.3.5లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/