Begin typing your search above and press return to search.

మిస్టరీ: ఇంట్లో ఉన్న వ్యక్తికి కరోనా..ఎలా సాధ్యం?

By:  Tupaki Desk   |   24 April 2020 11:30 AM GMT
మిస్టరీ: ఇంట్లో ఉన్న వ్యక్తికి కరోనా..ఎలా సాధ్యం?
X
కరోనా వైరస్ సోకకుండా లాక్ డౌన్ విధించాయి ప్రభుత్వాలు. అందరూ ఇళ్లలోనే ఉండాలని.. అలా ఉంటే కరోనా వైరస్ వ్యాపించదని ప్రచారం చేశాయి. దీంతో చావు భయంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అన్ని దేశాలు లాక్ డౌన్ విధించడంతో 80శాతం జనాలు ఇంట్లోనే ఉంటున్నారు.

లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి తన ఇంటికే పరిమితం అయిన 65 ఏళ్ల వ్యక్తికి బుధవారం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే ఇది ఆయనకు ఎలా సోకిందనేది ఇప్పటికీ అధికారులకు - సదురు వ్యక్తికి కూడా అంతుచిక్కడం లేదు. సంక్రమణ మూలాన్ని శోధించినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.ఇక ఆయన భార్యకు ఈ కరోనా పాజిటివ్ రాలేదు. ఆమెకు కూడా నెలరోజులుగానే ఇంట్లోనే ఉంటోంది.

ఇండోర్ లో వెలుగుచూసిన ఈ కేసు ఇప్పుడు అధికారులకు మిస్టరీగా మారింది. జనాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒంటరిగా ఉన్నా కూడా కరోనా సోకడం చర్చనీయాంశమైంది. అయితే అతడి ఇంటికి వచ్చిన పాలు - ఇతర సామగ్రి ద్వారా కరోనా వ్యాపించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దానిపై ఆరాతీస్తున్నా ఫలితం కనిపించడం లేదు.

దేశవ్యాప్తంగా అన్ని కేసులకు మూలాలు తెలిసినా.. ఇండోర్ లోని ఈ 65 ఏళ్ల వ్యక్తికి మాత్రం కరోనా ఎలా వచ్చిందో తెలియక అధికారులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.