Begin typing your search above and press return to search.

పరిస్థితి విషమం: ఇంద్రాణి సూసైడ్ యత్నం

By:  Tupaki Desk   |   3 Oct 2015 4:34 AM GMT
పరిస్థితి విషమం: ఇంద్రాణి సూసైడ్ యత్నం
X
కన్నకూతురినే పాశవికంగా హత్య చేసిన ఇంద్రాణి వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తన కుమార్తె షీనాబోరా హత్య చేసిన ఉందతం నాటకీయంగా బయటకు రావటంతో.. ఇంద్రాణిని అరెస్ట్ చేయటం తెలిసిందే.

ముంబయిలోని అర్థర్ రోడ్ లో ఉన్న జైల్లో ఇంద్రాణి ఉన్నారు. తనకు అనారోగ్యంగా ఉందని చెప్పటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మూర్చవ్యాధికి చికిత్స తీసుకుంటున్నఆమె.. తనకిచ్చిన మందుల్ని మోతాదుకు మించి మింగినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య యత్నం చేసిన ఇంద్రాణి ఆరోగ్యం ఇప్పుడు విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఆమెకు మెరుగైన వైద్యం చేసేందుకు ఐసీయూలో చేర్చారు. ఆమె ఆత్మహత్యాయత్నం ఎలా చేసుకున్నారో తేల్చేందుకు అవసరమైన నమూనా పరీక్షల్ని నిర్వహించారు. శాంపిల్స్ ను పరీక్షల కోసం పంపారు. వీటి ఫలితాలు రావాల్సి ఉంది. అవి వస్తే.. ఆమె ఆత్మహత్య ఎలా చేసుకున్నారన్న విషయం తెలుస్తుందని చెబుతున్నారు. ఇక.. మోతాదుకు మించిన మందులు ఆమెకు ఏ విధంగా చేరాయన్న అంశంపై మీద అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలు మలుపులు తిరిగిన షీనా బోరా హత్యకేసులో అత్యంత కీలకమైన ఇంద్రాణి ఆరోగ్యం ఇప్పుడు విషమంగా మారింది. ఆమెను సాధారణ స్థితిలోకి తెచ్చేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు.