Begin typing your search above and press return to search.

కూతుర్ని చంపేసి..మేక‌ప్ వేసేసిన వీఐపీ లేడీ

By:  Tupaki Desk   |   29 July 2017 8:13 AM GMT
కూతుర్ని చంపేసి..మేక‌ప్ వేసేసిన వీఐపీ లేడీ
X
దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం సృష్టించిన షీనాబోరా హ‌త్య‌ కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. షీనాబోరాను ఆమె త‌ల్లి ఇంద్రాణి హ‌త్య చేసినట్లు గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ క్ర‌మంలో అస‌లు ఏం జ‌రిగింద‌నేది ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్‌వర్‌ రాయ్ కోర్టుకు వెళ్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

శ్యామ్‌వ‌ర్ రాయ్ కోర్టుకు తెలిపిన ప్ర‌కారం ఇంద్రాణి, ఆమె మాజీ భ‌ర్త సంజ‌య్ ఖ‌న్నా, షీనాబోరా క‌లిసి వెళుతున్న స‌మ‌యంలోనే ఈ హ‌త్య జ‌రిగింది. `మేం కారులో బాంద్రా నుంచి వెళుతున్న స‌మ‌యంలో ఇంద్రాణి మేడం కారు ఆప‌మ‌ని చెప్పి ఆ వెంట‌నే షీనా నోరు గ‌ట్టిగా మూసేయాల‌ని నన్ను ఆదేశించారు. అనంత‌రం సంజ‌య్ ఖ‌న్నా జుట్టుప‌ట్టుకోగా...ఇంద్రాణి రెండు చేతుల‌తో షీనా గొంతు నులిమి చంపేశారు` అని డ్రైవ‌ర్ వివ‌రించాడు. అనంత‌రం ఖ‌న్నా-ఇంద్రాణి ఇంగ్లిష్‌లో ఏదో మాట్లాడుకొని కారును పాలిహిల్‌కు తీసుకువెళ్లాల‌ని కోరిన‌ట్లు తెలిపాడు.

``దారిలో 20 లీట‌ర్ల పెట్రోల్ కొనుక్కొని పాలిహిల్‌కు వెళ్లిన త‌ర్వాత ఇంద్రాణి మేడం షీనాబోరాకు త‌ల‌దువ్వారు, జుట్టువేశారు. లిప్ స్టిక్ కూడా పెట్టారు. త‌ర్వాత ఆమె శ‌వాన్ని బ్యాగులో చుట్టమ‌ని నాకు చెప్పారు. ఆ త‌ర్వాత వెంట తీసుకువెళ్లిన పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. ఈ స‌మ‌యంలో న‌న్ను బెదిరించారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెపితే అన‌వ‌స‌ర ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని అన్నారు.`` అంటూ డ్రైవ‌ర్ శ్యామ్‌వ‌ర్ కోర్టుకు వెల్ల‌డించాడు.

2012లో జ‌రిగిన షీనాబోరా హ‌త్య 2015లో డ్రైవ‌ర్ శ్యామ్‌వ‌ర్ రాయ్ అరెస్టుతో వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఇంద్రాణి స‌హా ఆమె మాజీ భ‌ర్త ఖ‌న్నా జైల్లో ఉన్నారు. కాగా ఇటీవ‌ల ఇంద్రాణి జైల్లో ర‌చ్చ చేసిన సంగ‌తి తెలిసిందే. జైలులో ఉన్న ఖైదీ మంజూల శెట్టి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది. అయితే.. జైలులోని స్టాఫ్ మంజూల‌ను తీవ్రంగా కొట్ట‌డం వ‌ల్లే మ‌ర‌ణించింద‌ని ఆరోపిస్తూ జైలులో మిగతా 200 మంది ఖైదీల‌తో ఇంద్రాణి నిర‌స‌న చేప‌ట్టింది. ఈ నిర‌స‌న సంద‌ర్భంగా జైలులో ఖైదీల‌తో జైలులోని కాగితాల‌కు నిప్పు పెట్ట‌డంతో పాటు వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారు. తమను అడ్డుకున్న అధికారులపై దాడికి దిగారు. ఇలా నిర‌స‌న చేప‌ట్ట‌డాన్ని త‌ప్పు ప‌ట్టిన పోలీసులు ఇంద్రాణితో స‌హా 200 మంది ఖైదీల‌ను ఈ కేసులో బుక్ చేసి విచార‌ణ చేప‌ట్టారు.