Begin typing your search above and press return to search.
నో నో నో ..ఇదే ఇంద్రాణి సమాధానం
By: Tupaki Desk | 5 Sep 2015 5:07 PM GMTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి పోలీస్ కస్టడీని ఈ నెల 7వరకు పొడిగించారు. ఈ రోజుతో ఆమె కస్టడీ ముగియడంతో ఆమెతో పాటు కారు డ్రైవర్ శ్యామ్ రామ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నాలను ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టారు. కొన్ని కీలక ప్రశ్నల వరకు సమాధానాలిచ్చిన ఇంద్రాణి తర్వాత విచారణకు పూర్తిగా సహకరించడం మానేసిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రశ్నలకు మౌనంగా తల ఊపడం లేదా నో అన్న సమాధానం మాత్రమే చెపుతోందని వారు చెప్పారు.
ఇప్పటికే పోలీసులు ఆమెను 170 గంటల పాటు విచారించారు. తాజాగా ఆమె చివరిసారిగా చెప్పిన విషయాలు అందరిని షాక్‌కు గురి చేశాయి. షీనాను కిరాతకంగా చంపేశాక..ఆమె మృతదేహానికి సుగంద ద్ర్యవ్యాలు పూయడంతో పాటు లిప్ స్టిక్ వేసి..ముస్తాబు చేసి..ఎవ్వరికి అనుమానం రాకుండా రాయఘడ్ తీసుకువెళ్లి దహనం చేసింది. అలాగే టెక్నికల్ గా కూడా ఎవ్వరికి దొరక్కుండా ఉండేందుకు ఆమెను దహనం చేసి వచ్చాక ఈ మెయిల్ ఐడీ క్రియేట్ చేయించి..తన కుమార్తె అమెరికాలో ఉన్నట్టు పలువురిని నమ్మించింది.
ఈ ముగ్గురు నిందితులకు రిమాండ్ పొగిడించాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కోర్టు ఈ నెల 7వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు చెప్పింది. దీంతో పోలీసులు వారిని ఖర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.