Begin typing your search above and press return to search.

జైల్లో బ్యూటీ పార్లర్ ఉందా? ఇంద్రాణి ముఖర్జీ మేకప్ లుక్ వైరల్..నెటిజన్ల కామెంట్

By:  Tupaki Desk   |   21 May 2022 9:30 AM GMT
జైల్లో బ్యూటీ పార్లర్ ఉందా? ఇంద్రాణి ముఖర్జీ మేకప్ లుక్ వైరల్..నెటిజన్ల కామెంట్
X
ఇంద్రాణి ముఖర్జీ అప్పట్లో తెల్లటి జుట్టుతో.. వాడిపోయిన ముఖంతో జైలుకు వెళ్లింది. కూతురిని హత్య చేసిన ఈమె కోర్టుకు హాజరైనప్పుడు.. గతంలో పెరోల్ సందర్భంగా అందవిహీనంగా కనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే అల్ట్రా మోడల్ లా దర్శనమిచ్చింది. తాజాగా కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన ఇంద్రాణిని చూసి అందరూ షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది.

శుక్రవారం జైలు నుంచి బయటకు వచ్చిన ఇంద్రాణి మీడియా ప్రతినిధులను చూసి చిరునవ్వు నవ్వారు. ఆమె మారిన రూపాన్ని చూసి సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. ఇంద్రాణి జైల్లో బ్యూటీ పార్లర్లు ఉన్నాయని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అంతకుముందు విడుదలైన ఫొటోల్లో ఆమె నెరిసిన జుట్టుతో కనిపించడం గమనార్హం. ఇప్పుడిలా అందంగా.. బాలీవుడ్ హీరోయిన్ లా కనిపించడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. చూస్తుంటే ఇంద్రాణికి జైల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్టుగా ఉందే? ఆమె జైల్లో ఉందా? ఏదైనా వేకేషన్ కు వచ్చిందా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

పాలిపోయి.. జుట్టు నెరిసి ఉన్న ఇంద్రాణిని గతంలో చూసిన వారు ఇప్పుడు చూసిన వారు అవాక్కవుతున్నారు. చాలా స్లిమ్ గా.. జుట్టు నల్లగా.. ఏదో మేకప్ వేసుకొని వచ్చినట్టు జైలు నుంచి ధీమాగా దిగింది ఇంద్రాణి.. ఆమె మీడియాతో తొలిసారి మాట్లాడిన మాటలు చూస్తే కూడా కించత్ తప్పు చేశానన్న భావన వ్యక్తం కాకపోవడం గమనార్హం. జైల్లో ఉన్నానన్న ఫీలింగ్ యే లేకుండా మీడియాతో ఆమె సరదాగా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.అందుకే నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. జైల్లో బ్యూటీ పార్లర్ ఉందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో అరెస్ట్ అయిన ఇంద్రాణి ముఖర్జీ ఏడేళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. ముంబై సీపీబీ కోర్టు నిర్ధేశించిన ప్రకారం రూ.2 లక్షల పూచీకత్తను సమర్పించిన తర్వాత ఇంద్రాణి ముఖర్జీ జైలు నుంచి బయటకు వచ్చారు. బుధవారం సుప్రీంకోర్టు ఇంద్రాణికి బెయిల్ మంజూరు చేసింది.

జైలు నుంచి బయటకు వచ్చిన ఇంద్రాణి హాట్ కామెంట్స్ చేశారు. నేను ఇప్పుడు సానుభూతి, క్షమాపణ.. నన్ను బాధ పెట్టిన వారందరినీ నేను క్షమించానని.. నేను జైలులో చాలా నేర్చుకున్నానని ఇంద్రాణి కారులో వెళ్లిపోయారు. పీటీఐ కథనం ప్రకారం స్పోర్టింగ్ జెట్ బ్లాక్ హెయిర్ తో ముఖర్జీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చి కారులో బయలు దేరారు.

2 లక్షల తాత్కాలిక నగదు బాండ్ సమర్పించాలని గురువారం ట్రయల్ కోర్టు ఆమెను ఆదేశించింది. సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఆ ఉత్తర్వుల్లో ముఖర్జీ తప్పనిసరిగా తన పాస్ పోర్ట్ ను ప్రత్యేక కోర్టు ముందు అప్పగించాలని.. కోర్టు అనుమతి లేకుండా భారత్ వదిలి వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఈ కేసులో సాక్షులెవరిని సంప్రదించవద్దని, సాక్ష్యులను తారుమారు చేయవద్దని ఇంద్రాణిని కోర్టు ఆదేశించింది. ఆమె తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని.. ఎలాంటి వాయిదాలు కోరకూడదని కోర్టు తేల్చిచెప్పింది.

ఈ షరతులు ఉల్లంఘించినట్టై బెయిల్ రద్దుకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రాసిక్యూషన్ కు స్వేచ్ఛ ఉంటుందని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

2012 ఏప్రిల్ 23 న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురైంది. 2015 లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు.

ఇంద్రాణి డ్రైవర్ అప్రూవర్‌గా మారి ఉన్న విషయం చెప్పడంతో పోలీసులు ఇంద్రాణిని అరెస్ట్ చేశారు. హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం జైలులో షీనా బోరా శిక్ష అనుభవిస్తున్నారు.