Begin typing your search above and press return to search.

బెంగళూరులో ఆంధ్ర పారిశ్రామికవేత్త హత్య

By:  Tupaki Desk   |   31 Oct 2016 6:53 AM GMT
బెంగళూరులో ఆంధ్ర పారిశ్రామికవేత్త హత్య
X
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన పారిశ్రామికవేత్త ఒకరు కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ హత్యకు గురయ్యారు. పరుచూరి సురేంద్రకుమార్ చౌదరి అనే పారిశ్రామికవేత్తను ఆదివారం రాత్రి 9.30కు దుండగులు ఆయన ఇంటి వద్దే కాల్చి చంపారు. ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్న సురేంద్రను పల్సర్ బైక్‌ పై ఇద్దరు వ్యక్తులు ఫాలో అయ్యారు. సురేంద్రకుమార్‌ ఇంటిలోకి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరిపారు. మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో సురేంద్రకుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే దీపావళి కావడంతో తుపాకుల శబ్ధాన్ని కూడా బాణసంచా శబ్దంగానే భావించారు స్థానికులు. దీంతో చాలాసేపు వరకు సురేంద్రకుమార్ హత్యను గుర్తించలేకపోయారు. అనంతరం స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

కాగా సురేంద్రకు మినరల్ వాటర్ ప్లాంట్లు వంటి వ్యాపారాలతో పాటు గ్లోబల్ ఫౌండేషన్ అనే సంస్థ ఉంది. గతంలో ఒక చీటింగ్ కేసుకు సంబంధించి కేరళకు చెందిన కొందరు వ్యక్తులు సురేంద్రపై కక్ష పెంచుకున్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరాయి హంతకుల చేత సురేంద్రను చంపించి ఉండవచ్చని భావిస్తున్నారు. పక్కా ప్లాన్ తోనే ఈ మర్డర్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ఈ హత్య వెనుక ఆయన పాత మేనేజర్ హస్తం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియలెస్టేట్ విభేదాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/