Begin typing your search above and press return to search.

సోఫా ఫై వైన్ చల్లిన లేడీ.. లీగల్ నోటీస్ పంపిన పారిశ్రామికవేత్త

By:  Tupaki Desk   |   7 May 2020 2:30 PM GMT
సోఫా ఫై  వైన్ చల్లిన లేడీ.. లీగల్ నోటీస్ పంపిన పారిశ్రామికవేత్త
X
పెంపుడు జంతువులు, మొక్కలు ఇతర జీవం ఉన్న వాటిపై ప్రేమ ఉన్నదంటే ఒప్పుకోవచ్చు. కానీ ముచ్చటపడి కొన్న సోఫా పాడైందని ఓ పారిశ్రామికవేత్త ఏకంగా అతిథికి లీగల్ నోటీస్ ఇవ్వడం వైరల్ అయ్యింది. అంతపెద్ద పారిశ్రామికవేత్త ముచ్చటపడి కొనుకున్న సోఫాపై ఓ అతిథి వైన్ పారబోశాడు. కోట్లు ఉండే ఆ కోటీశ్వరుడు ఈ లక్షల సోఫా కోసం ఫైట్ మొదలుపెట్టాడు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఒక పార్టీ సమయంలో తన అతిథి తన సోఫాలో వైన్ చల్లాడని ఒక పారిశ్రామికవేత్త సీరియస్ అయ్యాడు. చిన్న ఘటనకు ఊగిపోయాడు. చాలా ఖరీదైన తన సోఫాను ఖరాబు చేశాడని మండిపడ్డాడు. అంతటితో ఊరుకోకుండా ఆ పారిశ్రామికవేత్త ఇప్పుడు తన సోఫాను పాడు చేసినందుకు రూ .2.13 లక్షలు చెల్లించాలని లీగల్ నోటీసు పంపారు. సోఫాను రిపేర్ చేయడానికి అయ్యే మొత్తం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నాడు. ఈ ఘటన చర్చనీయాంశమైంది.

ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త సంజయ్ జిందాల్ తనకు ఇష్టమైన సోఫా మీద రెడ్ వైన్ చిందినందుకు నటి, పారిశ్రామికవేత్త పింకీ హర్వానీకి లీగల్ నోటీసు పంపారు. ఇటీవల సంజయ్ తన స్నేహితులు మరియు ఇతర అతిథుల కోసం హౌస్-వార్మింగ్ పార్టీని నిర్వహించాడు. పింకీ కూడా దీనికి హాజరైంది. విదేశాల నుంచి ముచ్చటపడి దిగుమతి చేసుకున్న సోఫాపై పింకి పార్టీలో తెలియక రెడ్ వైన్ చిందించింది. ఈ చర్యతో ఆగ్రహించిన సంజయ్ ఇప్పుడు తన సోఫాను బాగు చేయమని డబ్బు చెల్లించాలని కోరుతూ లీగల్ నోటీసు పంపారు.

ఈ ఘటనపై ప్రముఖులు మండి పడుతున్నారు. ఆ పారిశ్రామికవేత్త సంజయ్ ఎక్కువగా స్పందిస్తున్నారని, పార్టీల్లో టేబుల్స్ లోకి దూసుకెళ్లడం, వైన్ చిందించడం మరియు అద్దాలు పగలగొట్టడం వంటివి సాధారణమైనవని అంటున్నారు. పాశ్చాత్య సంస్కృతిలో పార్టీల్లో కొంతమంది మర్యాదస్తులు వైన్ చిందించడం తీవ్రమైనదిగా భావిస్తారు. పింకీ వెంటనే క్షమాపణ చెప్పాలని సోఫాను రిపేర్ చేయడానికి ఛార్జీలను భరించాలని మరికొందరు కోరుతున్నారు. ఈ ఘటన వెలుగుచూశాక ఇక ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు సోఫాలపై పారబోయకుండా సెలెబ్రెటీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.