Begin typing your search above and press return to search.
’అమ్మ చెప్పిన మాట’ను అపోలో చెప్పింది
By: Tupaki Desk | 24 Feb 2017 3:37 AM GMTఅనుమానాలు ఉన్నప్పుడు అవన్నీ తీరిపోయేలా సమాధానాల్ని చెప్పేస్తే సరిపోతుంది. అందుకు భిన్నంగా కొన్ని చెప్పి.. మరికొన్ని దాచి పెడితే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? ప్రజల్లో లేని పోని గందరగోళానికి ఎంతలా దారి తీస్తాయన్న విషయాన్ని అపోలో తీరును చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన అమ్మకు చికిత్స చేసిన అపోలో.. చాలానే సందేహాల్ని ప్రజలకు మిగిల్చిందనే చెప్పాలి. ప్రజలకు వచ్చిన సందేహాల్ని తీర్చే ప్రయత్నం చేయని అపోలో.. అమ్మ మృతిపై తమకున్న అనుమానాల్ని.. ప్రజల్లో నెలకొన్న ఆందోళనను మద్రాసు హైకోర్టు తీసుకొస్తూ ఒక పిటీషన్ దాఖలు చేయటం తెలిసిందే.
తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా అపోలో ఆసుపత్రి ఆసక్తికరమైన అంశాల్ని వెల్లడించింది. జయలలిత మృతిపై విచారణ జరపాలని.. విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న పిటీషన్ ను అన్నాడీఎంకే ప్రముఖుడు జోసెఫ్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా.. అపోలో తన కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేసింది.
మీడియాలో వచ్చిన వార్తలు.. ఊహాగానాల ఆధారంగా ఆసుపత్రిని శంకిస్తూ పిటిషనర్ కేసు వేసినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఆసుపత్రిలో చికిత్స పొందిన వేళ.. అమ్మ తన ఫోటోలను విడుదల చేయటానికి ఇష్టపడలేదని.. అందుకే తాము ఫోటోలను విడుదల చేయలేదని వెల్లడించారు. భారతీయ వైద్య మండలి విధివిధానాల ప్రకారం రోగి చికిత్స వివరాలు వెల్లడించరాదని.. జయకు చికిత్స పొందినప్పుడు సైతం ఆమె అనుమతితోనే ప్రకటనల్ని జారీచేసినట్లుగా వెల్లడించారు.
జయ చికిత్స వివరాల్ని నివేదిక రూపంలో కోర్టుకు సమర్థించేందుకు తాముసిద్ధంగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కోర్టుకు అపోలో చెప్పిన మాటల్ని విన్నప్పుడు పలువురు వ్యక్తం చేస్తున్న సందేహాల్ని చూస్తే..
= ప్రముఖులు ఆసుపత్రుల్లో చేరినప్పుడు హెల్త్ బులిటెన్లను ఎప్పటికిప్పుడు పలు ఆసుపత్రుల యాజమాన్యాలు వెల్లడిస్తుంటాయి. అంటే.. అవన్నీ భారతీయ వైద్యమండలి విధివిధానాల్ని పాటించటంలేదా?
= తన ఫోటోను రిలీజ్ చేయొద్దని అమ్మ చెప్పారని.. అందుకే తాము ఫోటోల్ని రిలీజ్ చేయలేదని అపోలో చెబుతోంది. ఇదే మాటను మొదట్లోనే ఎందుకు చెప్పలేదు? అప్పుడు కుదర్లేదనుకున్నా.. అమ్మ చనిపోయి.. ఆమె మృతి వివాదంగా మారినప్పుడు ఎందుకు చెప్పనట్లు?
= అమ్మ సమాధి స్థితిలో ఉందంటూ అపోలో చేసిన ట్వీట్లు కూడా అమ్మ ఆమోదంతోనే చేశారా?
= తన ఫీలింగ్స్ ను అపోలో వైద్యులకు అర్థమయ్యేలా చెప్పే స్థితిలో అమ్మ ఉన్నప్పుడు.. సంతకం పెట్టకుండా.. వేలిముద్రనే ఎందుకు వేసినట్లు?
= ఫోటోలు తీయొద్దని.. తన ఆరోగ్యం ఎలా ఉందో ప్రజలకు తెలీకుండా ఉంచండని అపోలో వైద్యుల్ని కన్వీన్స్ చేయగలిగిన స్థితిలో అమ్మ ఉంటే.. అదే విషయాన్ని ప్రజలకు ఎందుకు వివరించనట్లు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/