Begin typing your search above and press return to search.
ఇన్ఫోసిన్ కు ఇక.. క్యాజువల్స్ తో వెళ్లొచ్చు
By: Tupaki Desk | 2 Jun 2015 9:19 AM GMTప్రఖ్యాత ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ లో తీసుకున్న తాజా నిర్ణయం అక్కడి ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపుతోంది. నిత్యం డ్రెస్ కోడ్‌తో ఉక్కిరిబిక్కిరి అయ్యే ఉద్యోగులు ఇకపై.. డ్రెస్ విషయంలో క్యాజువల్ గా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.సోమవారం నుంచి గురువారం వరకూ పక్కా ఫార్మల్స్ మాత్రమే ధరించాలన్న నిర్ణయం కారణంగా ఏళ్ల కొద్దీ వేలాదిమంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పలువురు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే వారున్నారు.
డ్రెస్ కోడ్ కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్న విమర్శ ఉంది. అయినప్పటికీ..కంపెనీ ఈ విషయంలో ఉద్యోగులు కోరిన విధంగా నిర్ణయం తీసుకోలేదు. అందుకు భిన్నంగా తాజాగా ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఆఫీసుకు వచ్చే సమయంలో క్యాజువల్స్ వేసుకోవచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి ఈమొయిల్స్ ఇప్పటికే ఉద్యోగులకు చేరినట్లు చెబుతున్నారు.
తాజా నిర్ణయంతో జీన్స్.. క్యాజువల్స్ వేసుకోవచ్చని.. కాకపోతే.. మరీ ఇబ్బందికరంగా లేని దుస్తులు ధరించాలని కంపెనీ పేర్కొంది. సంస్థ గౌరవాన్ని.. మర్యాదను నిలబెట్టే బాధ్యత ఉద్యోగులదేనని చెప్పిన ఇన్ఫోసిన్.. డ్రెస్‌కోడ్ ను మార్పును జూన్ ఒకటి నుంచి అమలు చేస్తోంది.
ఈ నిర్ణయం పట్ల వేలాది మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం గుదిబండలా ఫీలైన పరిమితి ఇకపై ఉండదన్న ఆనందం వారి మాటల్లో వ్యక్తమవుతోంది.ఈ భారీనిర్ణయాన్ని తీసుకోవటంలో సంస్థ బాధ్యతలు చేపట్టిన విశాల్ శిక్కానే కారణమంటున్నారు. నిర్ణయం ఎవరు తీసుకున్నప్పటికీ.. డ్రెస్‌కోడ్ గుదిబండ పోవటాన్ని వేలాది మంది ఇన్ఫోసియన్లు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.