Begin typing your search above and press return to search.
ఇన్ఫోసిస్ పై కరోనా ఎఫెక్ట్..సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 21 April 2020 10:30 AM GMTకరోనా దెబ్బకు మామూలు - కార్పొరేట్ కంపెనీలే కాదు.. ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ సాఫ్ట్ వేర్ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’ కూడా ప్రభావితం అయ్యింది. కరోనా తీవ్రతకు తాజాగా ఇన్ఫోసిస్ తమ సంస్థలో కొత్త నియామకాలు రద్దు చేసేసింది. అంతేకాదు.. పదోన్నతులు కూడా ఇప్పట్లో ఉండవని తేల్చేసింది. ఇక జీతాల పెంపు సంగతి ఇప్పట్లో అడగవద్దని ఇన్ఫోసిస్ సంస్థ ప్రకటించింది.
ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్ తాజాగా సంస్థ నాలుగో త్రైమాసికం 2019-20 ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా తాత్కాలికంగా కొత్త నియామకాలను నిలిపివేస్తున్నామని.. జీతాల పెంపును స్తంభింపచేశామని.. అన్ని ప్రమోషన్లు తాత్కాలికంగా నిలిపివేశామని స్పష్టం చేశారు. ఇది సంస్థ ఉద్యోగులకు విచారం కలిగించే చర్యలే అయినా కరోనా వైరస్ తీవ్రత వాటిల్లిన నష్టం దృష్ట్యా చేయక తప్పడం లేదని వివరించారు.
ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూ.బి ప్రవీన్ రావ్ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు కొత్తగా తీసుకున్న వారికి ఉద్యోగాలిస్తామని.. క్యాంపస్ ప్లేస్ మెంట్లను తీసుకుంటామని’ వాటి గురించి ఆశావహులు భయపడవద్దని సూచించారు. ఇక ఇప్పటివరకు కరోనా కారణంగా ఇన్ఫోసిస్ నుంచి ఏ ఒక్క ఉద్యోగిని కూడా తాము తీసివేయలేదని స్పష్టం చేశారు.
ఇప్పట్లో ఇన్ఫోసిస్ సంస్థలు తెరుచుకోవని.. వర్క్ ఫ్రం హోంను కొనసాగిస్తామని.. కరోనా తగ్గాక కూడా 5శాతం కంటే తక్కువ ఉద్యోగులతోనే ఆఫీసులను నడిపిస్తామని తెలిపారు. క్రమంగా పెంచుతామని హామీ ఇచ్చారు.
ఇక ఇప్పటికే మైసూర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న 6000 ట్రైనీలను ఇంటికి పంపించామని.. వారికి ఇంటి నుంచే రిమోట్ శిక్షణ ఇస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది.
కాగా ఇన్ఫోసిస్ సంస్థ నుంచి ఈ చివరి త్రైమాసికంలో ఏకంగా 1083మంది ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోవడం గమనార్హం.