Begin typing your search above and press return to search.
రూ.10 వేలతో మొదలై రూ.6.63 లక్షల కోట్లకు చేరిన ఆ కంపెనీ!
By: Tupaki Desk | 15 Dec 2022 5:30 AM GMTఇప్పుడు అందరూ స్టార్టప్ సంస్థలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యోగం చేయడం కంటే పది మందికీ ఉద్యోగాలు కల్పించడాన్నే ఇష్టపడుతున్నారు. ఒక చక్కటి ఆలోచన ఉంటే చాలు.. నిధుల సేకరణ, సాంకేతిక సహాయం, ఇతర గైడెన్స్, ప్రముఖ వ్యాపారవేత్తలతో సూచనలు, సలహాలు ఇలా అన్ని విధాలా స్టార్టప్ సంస్థలకు ఇప్పుడు మంచి అండదండలు లభిస్తున్నాయి.
కానీ 40 ఏళ్ల క్రితం ఎవరి సహాయ సహకారాలు లేకుండా కేవలం రూ.10 వేల పెట్టుబడితో మాత్రమే ప్రారంభమై ప్రస్తుతం రూ.6.63 లక్షల కోట్ల మార్కెట్ విలువ గల కంపెనీగా ఎదిగింది.. ఇన్ఫోసిస్. సరిగ్గా నేటికి 40 ఏళ్ల క్రితం స్టార్టప్ అనే పదానికి అర్థమే తెలియని రోజుల్లో ఏడుగురు తాము కన్న కలను సాకారం చేసుకోవడానికి ఇన్ఫోసిస్ రూపంలో ఒక దారిని వెతుక్కున్నారు. దాన్ని ఇప్పుడు దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా తీర్చిదిద్దారు.
ఎన్‌ఆర్ నారాయణమూర్తి తన సతీమణి సుధామూర్తి నుంచి తీసుకున్న రూ.10,000 పెట్టుబడితో మొదలైన ఇన్ఫోసిస్ ప్రస్థానం ఈ 40 ఏళ్లలో ఇంతై.. ఇంతింతై.. వటుడింతై.. అన్న చందంగా సాగుతోంది. ఏకంగా 3.14 లక్షల మందికి ఉపాధి చూపుతూ.. ఏడాదికి రూ.1.33 లక్షల కోట్ల వార్షిక ఆదాయాన్ని సంపాదించే స్థాయికి ఇన్ఫోసిస్ ఎదిగింది.
ఇన్ఫోసిస్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని ఒకసారి గమనిస్తే.. 1981లో ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ నుంచి ఏడుగురు ఇంజినీర్లు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి, నందన్ నీలేకని, ఎన్.ఎస్.రాఘవన్, ఎస్.గోపాలకృష్ణన్. ఎస్.డి.శిబూలాల్, కె.దినేశ్, అశోక్ అరోరా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. వారంతా కలిసి ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ పేరిట ఒక చిన్న స్టార్టప్ ని పుణేలో ఏర్పాటు చేశారు.
ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ ని 1983లో బెంగళూరుకు మార్చారు. 1987లో అమెరికాలో అంతర్జాతీయ కార్యాలయం ఏర్పాటు చేశారు. 1993లో ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షేర్లను ఇవ్వడం తొలిసారి ప్రవేశపెట్టింది. అదే ఏడాది బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ)లో నమోదైంది.
ఇక తొలిసారిగా 1999లో 100 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని ఇన్ఫోసిస్ ఆర్జించింది. నాస్‌డాక్‌లోనూ నమోదైంది. ఇదే దూకుడుతో 2004లో బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని పొందింది. 2006లో ఇన్ఫోసిస్ లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 50 వేలు దాటింది.
2007లో ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆదాయమే 100 కోట్ల డాలర్లకు చేరుకుంది. 2009 నాటికి ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఒక లక్ష మందికి చేరింది. 2014లో తొలిసారిగా ఇన్ఫోసిస్ కు వ్యవస్థాపకుడు కాని వ్యక్తి విశాల్ సిక్కా సీఈఓగా నియమితులయ్యారు. 2017లో సిక్కా స్థానంలో ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్ వచ్చారు.
టీసీఎస్ తర్వాత 2021 జులైలో 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అధిగమించిన రెండో ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది.
ఇన్ఫోసిస్ ఇప్పటిదాకా 21 కంపెనీలను కొనుగోలు చేసింది. లోడ్‌స్టోన్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ కంపెనీని 2012లో 345 మిలియన్ డాలర్లతో సొంతం చేసుకోవడమే ఇప్పటిదాకా అతిపెద్ద కొనుగోలు. కాగా ఇన్ఫోసిస్ లో ఉద్యోగుల వలసలే ఆ కంపెనీకి ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా సరే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడమే లక్ష్యంగా ఇన్ఫోసిస్ ప్రస్థానం కొనసాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.